Homeహైదరాబాద్latest Newsస్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా...

స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్ ఆధ్వర్యంలో బీసీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్ మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరారు. బీసీ సమస్యల పైన చర్చలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ నుండి బీసీలకు వారి అవసర నిమిత్తం వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక,విద్య లకు తప్పనిసరిగా బ్యాంకు ద్వారా లోన్లు ఇచ్చే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది. కేజి టు పిజి ఉచిత విద్యను అమలు చేయాలని, కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం మండల అధ్యకులు సిరికొండ తిరుపతి, బీసీ విద్యార్థి సంఘం పట్టణ అధ్యక్షులు తాడూరి సంజయ్, దూడ నరేష్, నాంపల్లి రాజేశం, సందవేని మహేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img