సంధ్య థియేటర్ ఘటనలో పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ పై 105, 118 (1) రెడ్ విత్ 3/ 5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు. దీని పై 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే విధంగా 118 (1) సెక్షన్ కింద ఏడాది నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నేరం రుజువైతే అల్లు అర్జున్ కు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.