మన దేశ యువత తగినంత ఫిజికల్ యాక్టివిటీ చేయడం లేదని గ్లోబల్ హెల్త్ జర్నల్ లాన్సెట్ స్టడీలో తేలింది. 2022లో దాదాపు 50 శాతం మంది యువత ఫిజికల్లీ అన్ ఫిట్ గా ఉన్నారని వెల్లడైంది. వీరిలో 57 శాతం మంది మహిళలు, 42 శాతం మంది మగవాళ్లు ఉన్నారని తేలింది. యువత వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ చేయాలని WHO సూచించింది.