Homeవిచిత్రం50 Years For 2650 Crores : 50 ఏండ్లు పోరాడి 2.6 వేల కోట్లు...

50 Years For 2650 Crores : 50 ఏండ్లు పోరాడి 2.6 వేల కోట్లు సాదించారు

50 Years For 2650 Crores : 50 ఏండ్లు పోరాడి 2.6 వేల కోట్లు సాదించారు

50 Years For 2650 Crores : ఒక‌టి కాదు..రెండు కాదు ఏకంగా 50 ఏళ్ల పాటు త‌మకు వార‌స‌త్వంగా రావాల్సిన ఆస్తి కోసం పొరాడారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రామ్‌పూర్‌ను అప్ప‌ట్లో పాలించిన ఉమ్మ‌డి న‌వాబు ర‌జా అలీ ఖాన్ వారసులు.

అలీఖాన్‌కు చెందిన సుమారు రూ.2650 కోట్ల ఆస్తిని ష‌రియ‌త్ రూల్స్ ప్ర‌కారం.. త‌న 16 మంది చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సులకు త్వ‌ర‌లో పంచి ఇవ్వ‌నున్నారు.

ఈ ఆస్తి కోసం వార‌సులు 50 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిర‌గాల్సి వ‌చ్చింది.

పార్టిష‌న్ స్కీమ్ ప్ర‌కారం.. రామ్‌పూర్ జిల్లా జ‌డ్జ్ ఈ తీర్పును వెలువ‌రించారు.

మీ కిడ్నీలను కాపాడుకోండి ఇలా.. లేదంటే అంతే..

జులై 31, 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ తీర్పును రామ్‌పూర్ కోర్టు వెల్ల‌డించింది.

16 మంది వార‌సుల‌లో ఒక వార‌సుడు క‌జిమ్ అలీ ఖాన్ త‌రుపున వాదించిన న్యాయ‌వాది ముకేశ్ స‌క్సేనా తుది తీర్పు కోసం ఫైల్‌ను సుప్రీంకోర్టుకు పంపించామ‌ని తెలిపాడు.

అప్ప‌ట్లో రామ్‌పూర్‌ను పాలించిన న‌వాబ్ ర‌జా అలా ఖాన్‌.. 1947 లో భార‌త్‌కు స్వాతంత్య్రం వ‌చ్చాక ఇండియాలో రామ్‌పూర్‌ను విలీనం చేయ‌డానికి ఒప్పుకోలేదు.

బురఖా వేసుకుందని అమ్మాయిని కొట్టిన అకతాయిలు

త‌ర్వాత 1949లో రామ్‌పూర్‌ను ఇండియాలో విలీనం చేశాడు. ఆయ‌న 1966లో మ‌ర‌ణించాడు.

ఆయ‌న‌కు ముగ్గురు భార్య‌లు, ముగ్గురు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు ఉండేవారు.

రామ్‌పూర్‌ను భార‌త్‌లో విలీనం చేశాక‌.. ఆయ‌న ఆస్తుల‌కు ముగ్గురు కొడుకుల్లో పెద్ద‌వాడైన ముర్తాజా అలీఖాన్ మాత్ర‌మే అస‌లైన వారసుడ‌ని అప్ప‌టి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

దీంతో న‌వాబు మిగ‌తా కొడుకులు ఇద్ద‌రూ 1972 లో కోర్టులో కేసు వేశారు. అప్ప‌టి నుంచి ఆ కేసు కోర్టులో నానుతూ వ‌చ్చింది.

రాత్రి ఆలస్యంగా తింటున్నారా.. అలా మంచిదేనా..

న‌వాబు అలీఖాన్ వారసుల్లో పెద్ద‌కొడుకు ముర్తాజా కూతురు నిఖ‌త్ బి, కొడుకు మురాద్ మియాన్‌, న‌వాబు మ‌రో కొడుకు జుల్‌ఫిక‌ర్ అలీ ఖాన్ బ‌హ‌దూర్ భార్య బేగం నూర్ బానో(మాజీ ఎంపీ), ఆమె కొడుకు నవెద్ మియాన్, ఇత‌రులు ఉన్నారు.

ప్ర‌స్తుతం ఉన్న ప్రాప‌ర్టీలో 200 ఎక‌రాల బెన‌జిర్ బాగ్ ప్యాలెస్‌, స‌ర్హారీ కుందా ప్యాలెస్‌, షాహ్‌బాద్ బాగ్ ప్యాలెస్‌, ప్రైవేట్ రైల్వే స్టేష‌న్‌ను 16 మంది వార‌సుల‌కు స‌మానంగా పంచ‌నున్నారు.

16 మందిలో ఇద్ద‌రు వార‌సులు మ‌ర‌ణించారు. చ‌నిపోయిన వారి వార‌సుల‌కు ఆ షేర్‌ను అందిస్తామ‌ని వాళ్ల త‌రుపు లాయ‌ర్ తెలిపాడు.

Recent

- Advertisment -spot_img