Homeహైదరాబాద్latest Newsకార్మికులకు 52 రకాల వైద్య పరీక్షలు

కార్మికులకు 52 రకాల వైద్య పరీక్షలు

ఇదే నిజం, ముస్తాబాద్: మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సoక్షేమ మండలి అలాగే సి ఎస్ సి హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించి కార్మికులకు 52 రకాల పైగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి కార్డు తీసుకుని ఉన్న వారికి ఉచిత మెడికల్
క్యాంపు నందు 52 రకాల పైగా ఆరోగ్య పరీక్షలు ఉదాహరణ షుగర్ థైరాయిడ్,విటమిన్ డి, ఊపిరితిత్తులు,కిడ్నీ,లివర్ గుండె, బ్లడ్ గ్రూపింగ్, ,క్యాన్సర్,ఎలర్జీ సంబందిత సమస్యలకు వైద్య పరీక్షలు చేశారు. కార్మికులందరూ కార్మిక కార్డుతో వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ నిర్వాకులు మెరుగు శ్రీనివాస్, బింగి మహేష్, సిబ్బంది రాజు, అరవింద్, బాబు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img