Homeహైదరాబాద్latest Newsఘనంగా రైతు బంధు సహకార సొసైటీ 5వ వార్షికోత్సవం

ఘనంగా రైతు బంధు సహకార సొసైటీ 5వ వార్షికోత్సవం

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రం పరిధిలోని అయోధ్యాపురం గ్రామంలో రైతుబంధు పొదుపు పరపతి మరియు పరస్పర సహాయక సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, రైతుబంధు సొసైటీ 5వ, వార్షికోత్సవంతో పాటు, సొంత భవన ప్రారంభోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకున్నారు. నూతన భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని, కంప్యూటర్ ను వారి తండ్రి కీర్తిశేషులు బీరవెల్లి పుల్లారెడ్డి జ్ఞాపకార్థంగా సంస్థకు ఇచ్చారు. తొలుత 100 మంది సభ్యులతో ప్రారంభమై నేడు, 266 మంది సభ్యులతో పటిష్టపడింది. మునుముందు 500 మంది నుండి 1000 మంది సభ్యులను చేర్పించి, ఈ రైతు సంఘానికి నాబార్డ్ నిధులను సైతం సేకరించడమే ఏకైక లక్ష్యం అన్నారు.

దీని కోసం రైతుబంధు సొసైటీ ప్రతి సభ్యుని సహాయ సహకారాలు కూడా తప్పనిసరి అవసరమని, రైతుబంధు సొసైటీ విచ్ఛిన్నం కాకుండా ఉండటం కోసం, డిసిసిబి గూడూరు బ్యాంకు వారి ఆధ్వర్యంలో, వారి షరతులకు లోబడి కొనసాగుతుందని, రైతులకు కావలసిన ఎరువులను, పురుగుమందులను సేకరించి, సంఘంలో సభ్యత్వం గల రైతు సోదరులకు మున్ముందు విక్రయిస్తుందన్నారు. ఈ రైతు బంధు సంఘం అయోధ్యాపురం ఒక్క గ్రామానికే పరిమితం కాదని, గూడూరు మండలంలోని 39 గ్రామపంచాయతీ లోని రైతులను సభ్యులుగా చేసుకునే వెసులుబాటుతోనే, రిజిస్ట్రేషన్ చేయించిన రైతు బంధు సొసైటీ అని పేర్కొన్నారు. గూడూరు మండలంలోని ఏ గ్రామానికి చెందిన రైతైన దీనిలో సభ్యత్వం పొందవచ్చని తెలిపారు.

ఈ సొసైటీలో సభ్యత్వం కలిగిన రైతులకు, బయటి ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ షాప్ లోని ధరలకంటే, బ్రాండెడ్ కంపెనీల ఎరువులు, పురుగుమందులు, అగ్రికల్చర్ అధికారుల సూచన మేరకు తక్కువ ధరలకే పంపిణీ చేస్తామన్నారు. ఆసక్తిగల రైతులు సభ్యత్వం తీసుకోవాలని కోరారు. రైతుబంధు సొసైటీలోని రైతు సహోదరులు పరస్పర సహాయ సహకారాలతో, సంస్థను అభివృద్ధి పదంలోనికి తీసుకుని పోయేవిధంగా ఉండాలని, ఈరోజు రైతుబంధు సొసైటీ 5వ వార్షికోత్సవానికి విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైతుబంధు సొసైటీ చైర్మన్ బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ పొగాకు వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు గాదే ఆగా రెడ్డి, ముఖ్య సలహాదారులు రూపురెడ్డి మనోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు కంకటి నర్సయ్య, ఉప్పలయ్య, కమిటీ సభ్యులు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ రవికుమార్, కార్యదర్శి అజ్మీర అజ్మీర కోటేశ్వర రావు, గూడూరు డిసిసిబి బ్యాంక్ మేనేజర్ చైతన్య, రైతు బంధు సభ్యులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img