ఇదే నిజం, ధర్మపురి రూరల్ : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో 3 మండలాలు ధర్మపురి, వెల్గటూర్, గొల్లపల్లి సంభందించి 117 వివిధ కేసులలో పట్టుబడ్డ మద్యం , గుడుంబా దాదాపు 6 లక్షల విలువైన మద్యన్ని శనివారం రోజున కోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా డీఎస్పీ రఘు చందర్ , ఎక్సైజ్ సిఐ మహేందర్ సింగ్, ఆధ్వర్యంలో ధ్వంసం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని అందరి ముందు పంచనామా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రామ్ నరసింహ రెడ్డి, ఎస్సై, వెల్గటూర్ , గొల్లపల్లి పోలీసు అధికారులు పాల్గొన్నారు.