Homeహైదరాబాద్latest News6 బంతుల్లో 6 సిక్సర్లు..యువీ, పొలార్డ్ సరసన నేపాల్ ఆటగాడు

6 బంతుల్లో 6 సిక్సర్లు..యువీ, పొలార్డ్ సరసన నేపాల్ ఆటగాడు

నేపాల్ హార్డ్ హిట్టర్ దీపేంద్ర సింగ్ అరీ మరోసారి రెచ్చిపోయాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో సత్తాచాటాడు. ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్ టీ20 అంతర్జాతీయ టోర్నీలో ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపేంద్ర ఈ ఘనత సాధించాడు. కమ్రాన్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అతను వరుసగా ఆరు బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఈ రికార్డు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. (యురాజ్ సింగ్ 2007 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేసర్ బ్రాడ్ బౌలింగ్‌లో), పొలార్డ్ ( 2021 శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనంజయ బౌలింగ్‌లో) ముందున్నారు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో దీపేంద్ర అయిదో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో గిబ్స్ (దక్షిణాఫ్రికా), జస్కరన్(అమెరికా) ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టారు. శనివారం ఈ మ్యాచ్‌లో ఖతార్‌పై నేపాల్ 32 పరుగుల తేడాతో గెలిచింది.

Recent

- Advertisment -spot_img