IAS Officers : 65 మంది ఐఏఎస్‌లపై విచారణ
భారతదేశంలో ఎంతమంది ఐఎఎస్ (IAS Officers) , ఐపిఎస్( IPS Officers) అధికారులు పనిచేస్తున్నారు..
అందులో ఎంతమందిపై అవినీతి, ఆరోపణలు ఉన్నాయి.. ఎంతమందికి శిక్షపడింది..
ఎంతమందిపై విచారణ జరుగుతొంది..
రాష్ట్రాల వారీగా సమాచారం కావాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ విభాగానికి సమాచార హక్కు చట్టంతో దరఖాస్తు చేసింది..
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ చేసిన దరఖాస్తుకు వచ్చిన సమాచారం దేశవ్యాప్తంగా 2012 వరకు నమోదైన 96 అవినీతి నిరోధక శాఖ కేసుల్లో 65మంది ఐఏఎస్( IAS Officers ) అధికారులు విచారణ ఎదుర్కొంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ విభాగం తెలిపింది.
2012 నుంచి ఇప్పటివరకు ఎంతమందిపై విచారణ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం తెలపలేదు.
వారు తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఒడిశాలో ముగ్గురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు, అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం కేంద్ర పాలిత ప్రాంతం కేడర్‌లో ఒకరు చొప్పున అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు.
వీరు వివిధ కేసుల్లో దోషులుగా తేలగా.. కొన్ని కేసుల్లో శిక్ష పడినట్లు తెలిపారు.
ఇందులో ఒకరు సర్వీసులో ఉండగా, మిగతా నలుగురు పదవీ విరమణ చేశారు.
తమిళనాడు కేడర్‌కు చెందిన ఒక ఐపిఎస్ అధికారి లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్నారని ఆర్టీఐ చట్టం ప్రకారం అధికారి పేరు తెలపలేమని కేంద్రం సమాచారం ఇచ్చినట్లు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు..