- ప్రధాన మంత్రి వీధి వ్యాపారులు ఆత్మనిర్భర్ నిధి ఆన్లైన్ డాష్ బోర్డు ప్రారంభం
- ఈ పథకం యొక్క సమాచార పంపకం, సమీక్షకు ఒకే చోట పరిష్కారం
- ఈ పథకానికి సుమారు 7.15 లక్షల దరఖాస్తులు స్వీకరించగా అందులో సుమారు 1.7లక్షలు మాంజూరు చేయబడినవి
వీడియో సమావేశం ద్వారా వీధి వ్యాపారుల కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ భారత్ నిధి(పిఎంఎస్విఏనిధి) ఆన్లైన్ డాష్ బోర్డును కేంద్ర గృహ మరియు పట్టణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రారంభించారు.
పిఎంఎస్విఏనిధి ద్వారా పట్టణ ప్రాంతాల వారిని ప్రోత్సహించడం కోసం వారికి తగిన సమాచారం అందించడానికి, సమాచారాన్ని సమీక్షించడానికి, వాటాదారులందరికీ అందించడానికి ఈ ఆన్లైన్ డాష్ బోర్డు ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పథకం కోసం పిఎంఎస్విఏనిధి పోర్టల్ ద్వారా దరఖాస్తు స్వీకరణ 2 జులై 2020 తేదీ నుండి మొదలవగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 7.15 లక్షల దరఖాస్తులు రాగా అందులో సుమారు 1.70 లక్షల దరఖాస్తులు మంజూరు చేయబడ్డాయి.
01 జూన్ 2020న కేంద్ర గృహ, పట్టణ మంత్రిత్వ శాఖవారిచే ప్రారంభించబడిన ఈ పథకం కోవిడ్-19 లాక్డౌన్ వలన జీవనాధారాన్ని కోల్పోయిన వీధి వ్యాపారులకు రుణం సదుపాయాన్ని కల్పిస్తంది. 24 మార్చి 2020నాటికి పట్టణ ప్రాంతాల్లో లేదా పట్టణ శివారు ప్రాంతాల్లో సుమారు 50 లక్షల వీధి వ్యాపారులకు లబ్ది కల్పించే లక్ష్యంగా ఈ పథం రూపొందించబడింది. ఈ పథకం క్రింద వీథి వ్యాపారులకు రు.10,000 వరకు నెల వారీ వాయిదాల్లో సంవత్సరం వరకు తిరిగి చెల్లించే విధంగా, సంవత్సరానికి 7% వడ్డీ రాయితీతో లబ్దిదారుల ప్రత్యక్ష లబ్ది ట్రాన్ఫర్ విధానం ద్వారా త్రైమాసికానికి బ్యాంకు ఖాతాల్లోనికి జమ చేయబడతాయి. లబ్దిదారులు తమ వాయిదాలను ముందస్తుగా కానీ లేదా నిర్ణీత గడువు తేదీన కానీ చెల్లించవచ్చు. ముందస్తుగా చెల్లించినందుకు ఎటువంటి పెనాల్టీ లేదు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు నెలకు రు.100 వరకు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. ఈ రుణ సౌకర్యాన్ని వినియోగించుకుని వీధి వ్యాపారులు తమ ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచుకొని సరియైన సమయంలో నిర్ణీత గడువులోగా రుణాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది.