మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఇటీవల ముగిసింది. కాగా 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీపడేందుకు మొత్తం 7,994 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగినట్లుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అభ్యర్థిత్వాల ఉపసంహరణకు నవంబర్ 4 చివరి తేదీ. మహారాష్ట్రలో నవంబరు 20న ఒకేవిడతలో పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఫలితాలను ప్రకటించనున్నారు.