పెద్ద అంబర్ పేట్ నుంచి గచ్చిబౌలి వైపు భారీగా తరలిస్తున్న గంజాయిని ఇవాళ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కంటైనర్‌లో తరలిస్తున్న 800 కిలోల గంజాయిని పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.