శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిది మంది మరణించారు. రెస్క్యూ టీమ్ అయిదుగురు మృత దేహాలను బయటకు తీసుకొచ్చారు. మిగిలిన నాలుగు మృతదేహాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో 19 మంది సిబ్బంది ఉండగా వారిలో 10 మంది సురక్షితంగా బయట పడ్డారు.
మంటల్లో చిక్కుకొని మరణించిన వారి వివరాలు…
- డీఈ శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్
- ఏఈ వెంకట్‌రావు, పాల్వంచ
- ఏఈ మోహన్ కుమార్, హైదరాబాద్
- ఏఈ ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్
- ఏఈ సుందర్, సూర్యాపేట
- ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా
- జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ
- హైదరాబాద్‌కు చెందిన అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్
- హైదరాబాద్‌కు చెందిన అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది మహేష్ కుమార్