Homeజాతీయంమా పార్టీ అధ్య‌క్ష్యున్ని మేము నిర్ణ‌యించుకుంటాం

మా పార్టీ అధ్య‌క్ష్యున్ని మేము నిర్ణ‌యించుకుంటాం

The critics of the Congress blame the Gandhis, particularly Rahul Gandhi for recent crisis that the party faces across the country.

Yet, Rahul Gandhi continues to be the de facto leader of the Congress.

This is despite Rahul Gandhi refusing to take over the presidentship of the Congress after resigning following party’s defeat in the 2019 Lok Sabha election.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కేవలం తమ పార్టీ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారని… టీవీ జర్నలిస్టులు కాదని ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం ఎద్దేవా చేశారు.

సొంతంగా ఒక పార్టీని పెట్టుకుంటే అధ్యక్షుడిని జర్నలిస్టులు ఎన్నుకోవడం సాధ్యమవుతుందని అన్నారు.

ఓ జాతీయ టీవీ చానల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

99 శాతం మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారని అన్నారు.

క్షేత్ర స్థాయిలో ఉండే కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు తాను 35 బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నానని చిదంబరం తెలిపారు.

ఎంతో మంది కార్యకర్తలతో భేటీ అయ్యానని చెప్పారు. 100 మంది కార్యకర్తల్లో 99 మంది రాహుల్ నే అధ్యక్షుడిగా కోరుకుంటున్నారని తెలిపారు.

అయితే, పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ పోటీ చేస్తారా? లేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పారు.

అధ్యక్ష పదవికి ఇతర నాయకులు కూడా పోటీ పడొచ్చని… తాము మాత్రం పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు.

 

Recent

- Advertisment -spot_img