ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఫేం సంపాదించిన నటీమణుల్లో ఒకరు ఈషారెబ్బా. చిన్న పాత్రలు చేస్తూ సోలో హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకుందీ వరంగల్ భామ.
ఈషారెబ్బా ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేసే ఫొటోలు కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
టైట్ గ్రే టాప్ తో మ్యాచింగ్ క్యాజువల్ ప్యాంట్స్ డ్రెస్ లో ట్రెండీ వేర్ తో మెస్మరైజ్ చేస్తోంది.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో కీ రోల్ లో కనిపించిన ఈషా..ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ పిట్టకథలు,, లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ లో కనిపించింది.
సత్యదేవ్ కు జోడీగా పింకీ పాత్రలో నటించింది. ప్రస్తుతం అఖిల్ నటిస్తోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ విడుదల కోసం ఎదురుచూస్తోంది ఈషా రెబ్బా.