Homeతెలంగాణ#PRC : వేతన సవరణ అమలు చేస్తూ ఉత్తర్వుల జారీ

#PRC : వేతన సవరణ అమలు చేస్తూ ఉత్తర్వుల జారీ

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేస్తూ నిర్ణయం తీసుకొని ఈ మేరకు స్కేళ్లను సవరించింది.

దీంతో 2018 జులై 1 నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అమల్లోకి వచ్చినట్లయ్యింది.

ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లను కొనసాగించింది.

2018 జులై వరకు ఉన్న డీఏ 30.39 శాతం మూలవేతనంలో కలవనున్నది. 2020 ఏప్రిల్‌ నుంచి ఉద్యోగులకు మానిటరీ లబ్ధి చేకూరనుంది.

బకాయిలను పదవీ విరమణ సమయంలో ప్రభుత్వం చెల్లించనుంది.

2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి 31 వరకు బకాయిలు చెల్లింపు చేయనుంది.

ఏప్రిల్‌, మే బకాయిలను సైతం ఈ ఏడాదే ప్రభుత్వం చెల్లించనుంది. జూన్‌ నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందనున్నాయి

Recent

- Advertisment -spot_img