ది ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది టాలీవుడ్ భామ సమంత.
దీంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో సమంత చేయబోయే ప్రాజెక్టులపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
తాజాగా సమంతకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
నెట్‌ఫ్లిక్స్ మేనేజ్ మెంట్ ఇప్పటికే సమంతతో చర్చలు కూడా జరిపారని, రూ.8 కోట్లు రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని వార్తలు వస్తున్నాయి.
హై ఫ్రొఫైల్ వెబ్ సిరీస్ అండ్ ఫిలిమ్స్ తో వ్యూవర్స్ ను పెంచుకోవాలనే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు హాట్ కేక్ లా మారిపోయింది అందాల భామ సమంత.
మరి ఒకవేళ నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ కు ఒకే చెప్తే సమంత ఎలాంటి వెబ్ సిరీస్ తో అందరినీ పలుకరిస్తుందో చూడాలి.