HomeతెలంగాణKCR: అప్పట్లో చుక్క నీటి కోసం ఇబ్బందులు పడ్డాం... నేడు చెరువులు కళకళలాడుతున్నాయి

KCR: అప్పట్లో చుక్క నీటి కోసం ఇబ్బందులు పడ్డాం… నేడు చెరువులు కళకళలాడుతున్నాయి

”జిల్లాల పునర్విభజన అనంతరం సిద్దిపేటలో తొలి కలెక్టరేట్ సముదాయం ప్రారంభించడం సంతోషంగా ఉంది. నేను ఇక్కడే పుట్టాను. ఇది సెంట్రల్ తెలంగాణ. దీనికి ఎంతో భవిష్యత్ ఉంది. తెలంగాణ ఉద్యమంలోనూ సిద్దిపేట అండగా ఉంది”అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌, సమీకృత కలెక్టరేట్‌, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఆదివారం ప్రారంభించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు.

”అప్పట్లో నీటి కోసం సిద్దిపేట ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. నీటి చుక్క కోసం చాలా శ్రమ పడ్డారు. మనిషి చనిపోయిన తర్వాత స్నానం చేయడానికి నీళ్ల కోసం ఎమ్మెల్యేకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి రోజుల్ని చూశాం”.

”నేడు చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. దీని కోసమే మనం తెలంగాణ సాధించుకున్నాం. చాలా గర్వంగా ఉంది”అని కేసీఆర్ అన్నారు.

సిద్దిపేట అనంతరం కామారెడ్డిలో జిల్లా పోలీసు కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు.

Recent

- Advertisment -spot_img