Homeఎడిటోరియల్​#Praise #God : ఇంట్లో పూజాగది ఏ దిక్కున ఉంటే మంచిది.. ఎలా ఉండాలి..

#Praise #God : ఇంట్లో పూజాగది ఏ దిక్కున ఉంటే మంచిది.. ఎలా ఉండాలి..

వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. మనకు తెలియని ఎన్నో విషయాలు పైన నెగిటివిటీ ప్రభావం పడుతుంది.

అయితే వాస్తు నిపుణులు చెబుతున్న ఈ వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఏ సమస్య లేకుండా హాయిగా ఉండడానికి వీలు అవుతుంది.

సాధారణంగా అందరి ఇళ్లల్లో కూడా పూజ గదిని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు.

అలంకరించడం మొదలు శుభ్రత వరకు పూజ గదికి ప్రాముఖ్యత ఇస్తారు. నిజంగా పూజ గదిలో ఏదో మాయ ఉంటుంది. ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే పూజ గది పాజిటివిటీని ఇస్తుంది.

పూజ గదిలో కూర్చుని మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. అయితే పూజ గదిని ఎలా ఉంచుకోవాలి, వాస్తు ప్రకారం ఎలా సర్దుకోవాలి ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ వాస్తు నిపుణులు మనతో పంచుకోవడం జరిగింది.

మరి ఇక ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

పూజ గదిలో ఉండే దేవుడి విగ్రహాలు, పూజ గది గోడల మీద వేసే పెయింట్ ఇలా ఎన్నో విషయాలని పట్టించుకోవాలి. వీటన్నిటినీ శ్రద్ధగా మెయింటెన్ చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు.

అలాగే చాలా మంది ఏ విగ్రహాలని ఎక్కడ ఉంచాలి అనేది తెలియక ఇష్టం వచ్చినట్లు పెడుతూ వుంటారు. చాలా మంది స్పేస్, బడ్జెట్ బట్టి కూడా సర్దుతూ ఉంటారు.

అయితే పూజ గది లేదా పూజ మందిరం ఎంత చిన్నగా ఉన్నా సరే ఈ విషయాలను తప్పక పాటిస్తే మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు.

వీటిని పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ధన లాభం కూడా కలుగుతుందని చెప్పారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

పూజ గది ఉండే దిక్కు:

వాస్తులో అన్నిటి కంటే ముఖ్యమైన విషయం దిక్కు. ఏ దిక్కులో పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం, ఆ దిక్కు ద్వారా పాజిటివ్ ఎనర్జీ లేదా నెగిటివ్ ఎనర్జీ అనేవి వస్తాయి.

పూజ గదిని నిర్మించడానికి ఈశాన్యం వైపు మంచిది. ఈశాన్యం వైపు మాత్రమే పూజ గది ఉంచుకోవాలి గమనించండి.

పిరమిడ్ లాంటి ఆకారంగా వుండే మందిరాన్ని చాలా మంది ఇళ్లల్లో చూసే ఉంటాం.

అయితే ఇదే బెస్ట్ అని వాస్తు నిపుణులు అంటున్నారు. దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పారు.

మామూలుగా ఉండే గదుల్లో సీలింగ్ కంటే కూడా పూజ గదికి ఎంత తక్కువ సీలింగ్ ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు.

కాబట్టి పూజ గది నిర్మించుకునేటప్పుడు ఎంత తక్కువ సీలింగ్ ఉంటే అంత బెస్ట్. కనుక అలా ఫాలో అయిపోండి.

ప్లేస్మెంట్:

దిక్కులు తర్వాత ప్లేస్మెంట్ చాలా ముఖ్యం. ఏ వైపు ఏ దేవుడి విగ్రహాలు పెడుతున్నారు అనేది చాలా అవసరం. అయితే ఓకే దేవుడు విగ్రహాలని ఎక్కువ పెట్టకుండా ఒక్కో దేవుడి విగ్రహం ఒక్కొక్కటి ఉండేట్టు చూసుకోండి.

అలాగే వాటిని పెట్టేటప్పుడు ఒక దేవుడికి మరొక దేవుడికి మధ్య కాస్త స్పేస్ వదిలేయండి. అలానే వాటిని శుభ్రం చేసుకోండి.

విరిగిపోయిన దేవుడి విగ్రహాలని, పగిలిపోయిన దేవుడి విగ్రహాలను పూజ గదిలో పెట్టకూడదు గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల నెగిటివిటీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ విరిగిపోయిన వాటిని పగిలిపోయిన వాటిని పూజ గదిలో పెట్టొద్దు.

స్టోరేజ్:

పూజ గదిలో పూజ పుస్తకాలు, దీపాలు, అగరబత్తులు ఇవన్నీ సర్దుకోవడానికి చాలా మంది తెలియక పూజ గదిలో అల్మారాలు కట్టిస్తారు. ఎక్కువ అల్మారాలు అస్సలు ఉండకూడదు.

చాలా తక్కువ అల్మారాలు లేదా ఒక అల్మరా ఉంటే పరవాలేదు. అది కూడా ఆగ్నేయం వైపు మాత్రమే ఉంచుకోవాలి. ఇది కూడా తప్పక ఫాలో అవ్వండి.

పూజ గదిలో వేసే రంగులు:

ఇక పూజ గదిలో ఎలాంటి రంగులు వాడాలి, ఎటువంటి రంగులు వేయడం వల్ల పాజిటివిటీ ఉంటుంది అనే విషయం లోకి వస్తే.. పూజ గది లో రంగులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.

ఆ రంగులను ఎంచుకునేటప్పుడు లైట్ షేడ్స్ మాత్రమే వాడండి. ముఖ్యంగా తెలుపు పసుపులో లైట్ షేడ్స్ ని ఎంచుకోవడం మంచిది.

ముదురు రంగుల్ని వాడటం వల్ల ఏకాగ్రత తగ్గిపోయి ఇబ్బంది వస్తుంది. కాబట్టి రంగుల విషయంలో తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించండి.

వెలుతురు:

ఎక్కువ సేపు పూజ చేసుకోవడం లేదా మెడిటేషన్ చేసుకోవడం చాలా మందికి అలవాటు కాబట్టి మంచి వెలుతురు ఉండే ప్రదేశంలో పూజ గది నిర్మించుకోండి.

ఒకవేళ కనుక వెలుతురు రాకపోతే మంచి ఎల్ఈడి లైట్స్ లేదా దీపాలు వంటి వాటితో మెడిటేషన్ లేదా పూజ చేయండి.

అలానే ఎప్పుడూ కూడా దీపాలని పెట్టేటప్పుడు ఈశాన్యం వైపున పెట్టుకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

చూసారు కదా వాస్తు నిపుణులు చెప్పిన వాస్తు టిప్స్. ఈ చిన్నచిన్న వాస్తు టిప్స్ ని పాటించడం వల్ల సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు.

అదే విధంగా ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ఈ టిప్స్ మీకు బాగా సహాయం చేస్తాయి.

కాబట్టి పూజ గదిలో తప్పకుండా వీటిని అనుసరించి నెగెటివిటీకి దూరంగా ఉండి పాజిటివిటీని పొందండి.

Recent

- Advertisment -spot_img