Homeతెలంగాణవైఎస్ షర్మిల భర్త అనిల్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య భేటీ..?

వైఎస్ షర్మిల భర్త అనిల్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య భేటీ..?

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య భేటీ అయ్యారు.

నిన్న వీరి భేటీ జరిగిందని విశ్వసనీయ వర్గాలు చెపుతున్నాయి.

 అయితే, హైదరాబాదులోని లోటస్ పాండ్ లో కాకుండా… ఒక ప్రైవేట్ ప్రదేశంలో వీరిద్దరూ సమావేశమైనట్టు సమాచారం.

గత కొన్ని రోజులుగా బ్రదర్ అనిల్ కుమార్ తో రాజయ్య తరచుగా సమావేశమవుతున్నారని చెపుతున్నారు.

వీరి భేటీపై వైయస్సార్టీపీ వర్గీయుల్లో అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతోందట.

అయితే వీరిద్దరి మధ్య భేటీ రాజకీయపరమైనదా? లేక మత పరమైనదా? అనే విషయంలో క్లారిటీ లేదు.

Recent

- Advertisment -spot_img