Teenmar Mallanna Arrest : డబ్బుల కోసం తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్‌శర్మ ఏప్రిల్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ యూట్యూబ్ చానల్ అధినేత తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ.30 లక్షలు కావాలని మల్లన్న తనను బెదిరిస్తున్నాడని, ఇవ్వకుంటే తన చానల్‌లో తప్పుడు కథనాలు ప్రచారం చేసి పేరు చెడగొడతానని బెదిరించాడని లక్ష్మీకాంత్‌శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు ఇప్పటికే మల్లన్నకు రెండుసార్లు నోటీసులు ఇచ్చి విచారణ కూడా చేపట్టారు.
శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మల్లన్నను అరెస్ట్ చేశారు. మల్లన్నను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.