Homeఅంతర్జాతీయంTalibans Orders to Afghanistan People : ఆపేయండి.. పౌరులకు తాలిబన్ల హుకుం

Talibans Orders to Afghanistan People : ఆపేయండి.. పౌరులకు తాలిబన్ల హుకుం

Talibans Orders to Afghanistan People : దేశంలో నిరసనలన్నింటినీ ఆపేయాలని (afghanistan protests) పౌరులకు తాలిబన్ ప్రభుత్వం (Taliban government) హెచ్చరికలు జారీ చేసింది.

అనుమతి లేకుండా బ్యానర్ల ప్రదర్శన సైతం చేపట్టకూడదని స్పష్టం చేసింది.

మరోవైపు, అఫ్గాన్ ప్రజలను వదిలివెళ్లాలని అనుకోవడం తన అభిమతం కాదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Ashraf Ghani) పేర్కొన్నారు. నోట్ల కట్టలతో వెళ్లారన్న ఆరోపణలను ఖండించారు.

అఫ్గానిస్థాన్​లో నిరసన చేస్తున్న పౌరులపై (Afghan protest) ఉక్కుపాదం మోపే దిశగా తాలిబన్లు పావులు కదిపారు.

తమ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై చర్యలు చేపట్టారు. ఈ మేరకు తాలిబన్ కొత్త ప్రభుత్వం (Taliban government) హుకుం జారీ చేసింది.

దేశంలోని నిరసనలన్నింటినీ ఆపేయాలని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదేశించింది.

ముందస్తు అనుమతి లేనిదే నిరసనలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. నినాదాలతో పాటు బ్యానర్ల ప్రదర్శనకు సైతం తమ అనుమతి తీసుకోవాలని తేల్చిచెప్పింది.

కారణం ఏదైనా.. ఏ రకమైన ఆందోళనలు నిర్వహించకూడదని ఉత్తర్వుల్లో తెలిపింది.

ఆగని నిరసన

అయితే, తాలిబన్ల పాలనను వ్యతిరేకిస్తూ కాబుల్​లో పౌరులు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నారు.

మహిళలు సైతం ముందుండి పోరాటం చేస్తున్నారు. ప్లకార్డులు చేతబూని ‘దుష్టశక్తుల’కు వ్యతిరేకంగా (women protest in Afghanistan) పోరాడుతున్నారు.

విద్య, ఉద్యోగం తదితర రంగాల్లో హక్కుల సాధన కోసం గళమెత్తుతున్నారు.

దేశంలో కొత్తగా కొలువుదీరనున్న తాలిబన్ల ప్రభుత్వంలో తమకూ భాగస్వామ్యం కల్పించాలంటూ పోరాడుతున్నారు.

తాలిబన్లు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు.

శనివారం.. ఇస్లామాబాద్‌, ఐఎస్‌ఐకి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో కాబుల్‌ నగరం (women protest in kabul) మార్మోగిపోయింది. దీంతో ఆ నిరసన కార్యక్రమాలపై తాలిబన్లు విరుచుకుపడ్డారు.

వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ వారు వెనుదిరగలేదు. కొద్దిసేపటికే మళ్లీ తన నిరసనలను కొనసాగించారు.

Recent

- Advertisment -spot_img