Homeవిచిత్రంIncome with used Cigarette butts : వాడి పడేసిన సిగరెట్ పీకలతో లక్షల్లో సంపాదన

Income with used Cigarette butts : వాడి పడేసిన సిగరెట్ పీకలతో లక్షల్లో సంపాదన

Income with used Cigarette butts : నిత్యం లక్షలాది మంది పొగ తాగిన అనంతరం సిగరెట్ పీకలను నిర్లక్ష్యంగా పడేస్తుంటారు.

వాటితో పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది. అయితే ఈ సిగరెట్ పీకలతోనే అందమైన కళాకృతులను తయారు చేస్తోంది ఓ రీసైక్లింగ్​ కంపెనీ.

ఓ వైపు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూనే.. రకరకాల బొమ్మలు, దోమ తెరలు, దిండ్లు తయారు చేసి, అమ్ముతూ లాభాలు ఆర్జిస్తోంది.

MOHALI BASED ENTREPRENEUR TWINKLE KUMAR IS RECYCLING CIGARETTE BUTTS INTO TOYS CUSHIONS AND MOSQUITO REPELLANTS

దేశవ్యాప్తంగా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ సిగరెట్ పీకలు దర్శనమిస్తుంటాయి. వాటివల్ల అప్పుడప్పుడు అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి.

వాతావరణ కాలుష్యానికీ ఇవి కారణమవుతాయి. అయితే.. వీటిని రీసైక్లింగ్​ చేయటం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తోంది పంజాబ్​కు చెందిన ఓ సంస్థ. సిగరెట్ పీకలతోనే అందమైన బొమ్మలు, దిండ్లు, దుప్పట్లు, దోమ తెరలు తయారు చేస్తోంది.

“లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాను. సిగరెట్ రీసైక్లింగ్​పై యూట్యూబ్​లో వీడియోలు చూశాను. ఆ తర్వాత నాకూ ఈ విధానంపై ఆసక్తి పెరిగింది.

నోయిడాలో సిగరెట్​ పీకలను రీసైక్లింగ్ చేస్తున్న కంపెనీకి వెళ్లి స్వయంగా పరిశీలించాను.

ఈ సిగరెట్ పీకల ద్వారా పిల్లల బొమ్మలు, దిండ్లు, జూట్​బాక్స్​లు, దోమతెరలు లాంటివి తయారుచేస్తున్నాం.”

— ట్వింకిల్ కుమార్, వ్యవస్థాపకుడు

ఎలా తయారు చేస్తారు?

వాణిజ్య ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో బిన్​లను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా సిగరెట్ పీకలను సేకరిస్తున్నారు.

అలా సేకరించిన సిగరెట్ ముక్కలను రసాయనాల సాయంతో శుభ్రం చేస్తారు.

అలా చేయటం వల్ల అందులోని విష పదార్థాలు తొలగిపోతాయి. ఆ తర్వాత వాటిని వివిధ వస్తువులను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు.

“ఈ విధానం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. ఈ సిగరెట్ పీకలు పదేళ్లయినా మట్టిలో కలిసిపోవు.

ఇవి నీరు, గాలి, మట్టి అన్నింటినీ కలుషితం చేస్తాయి. మేము ఉత్తరభారతంలోని పలు ప్రాంతాల్లో స్మోకింగ్ జోన్స్ వద్ద బిన్​లను ఏర్పాటు చేశాం.

అలా సేకరించిన సిగరెట్ పీగలను రీసైక్లింగ్​ చేస్తున్నాం.”

– ట్వింకిల్ కుమార్, వ్యవస్థాపకుడు

పొగ తాగాక సిగరెట్ పీకలను తాము ఏర్పాటు చేసిన కలెక్షన్ బాక్స్​ల్లోనే వేయాలని కంపెనీ వ్యవస్థాపకుడు ట్వింకిల్ కుమార్ కోరారు.

కేటాయించిన డస్ట్​బిన్​లో వేస్తే.. పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు.

సిగరెట్ పీకల సేకరణ, ప్రాసెసింగ్, తయారీలో స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img