Homeస్పోర్ట్స్Rohit Sharma record : ఐపీఎల్‌ చరిత్రలో రోహిత్‌ శర్మ అరుదైన ఘనత..

Rohit Sharma record : ఐపీఎల్‌ చరిత్రలో రోహిత్‌ శర్మ అరుదైన ఘనత..

Rohit Sharma New Record in ipl history : కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు.

ఐపీఎల్‌లో ఒక జట్టుపై వెయ్యి పరుగుల సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. 

ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ రెండో బంతిని ఫోర్‌ కొట్టిన రోహిత్‌ కేకేఆర్‌పై వెయ్యి పరుగులు మైలురాయిని అందుకున్నాడు.

తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు.

ఇక రోహిత్‌ తర్వాతి స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ 943, 913 పరుగులతో(కేకేఆర్‌, పంజాబ్‌ కింగ్స్‌), విరాట్‌ కోహ్లి 909 పరుగులు(ఢిల్లీ క్యాపిటల్స్‌) వరుసగా ఉన్నారు.

కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ధాటిగా ఆడుతోంది.

తొలి పవర్‌ ప్లే ముగిసే సమయానికి ఆరు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 56 పరుగులు చేసింది.

క్వింటన్‌ డికాక్‌ ఇన్నింగ్స్‌ 6వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టడంతో ముంబై స్కోరు పరిగెత్తింది. రోహిత్‌ 27, డికాక్‌ 27 పరుగులతో ఆడుతున్నారు.

Recent

- Advertisment -spot_img