KCR comments on election commission in TRS Plenary : ఈసీపై కేసీఆర్ వ్యాఖ్యలు దేనికి సంకేతం…
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఈ సందర్బంగా కేసీఆర్ పార్టీ పాలనను ప్రజలకు వివరిస్తూ పలు విషయాలను ప్రస్తావించారు.
అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను ఉద్దేశించి ఎలక్షన్ కమీషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.
ఈసీ తన పరిధిని దాటి వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు కేసీఆర్.
అలాగే ఎలక్షన్ కమీషన్‌ను తన గౌరవం కాపాడుకోవాలని హెచ్చరిస్తున్నా అంటూ ఒక రాజకీయ పార్టీపై చేసినట్లుగా కామెంట్ చేశారు.
అసలు ఒక రాజ్యంగ బద్ద వ్యవస్థపై కేసీఆర్ ఇలాంటి కామెంట్లు చేయడం వెనక ఓటమి బయమే ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.
గతంలో ఆంద్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు, దేశంలోని పలు రాష్ట్రాల్లో నాయకులు ఓటమిని ముందుగా గమనించినపుడు ఇలా ఎలక్షన్ కమీషన్ మీద నమ్మకం పోయిందంటూ వ్యాఖ్యలు చేయడం గమనించవచ్చు.
అలాగే గత కొద్ది కాలంగా టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రతిష్ట తగ్గుతందని పలు సర్వేలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో కూడా ఈ సర్వేలకు మద్దతు కనపడుతూ తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో హుజూరాబాద్‌లో కేసీఆర్ తమ పార్టీ ఓటమిని ముందుగానే గ్రహించి ముందుగానే తమను తాము తరువాత సమర్ధించుకునేందుకు ఇటువంటి కామెట్లు చేస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఇక పార్టీ హుజూరాబాద్‌లో ఓడినా మేము అప్పుడే చెప్పాము, నిజంగా బీజేపీ గెలవలేదు అంతా ఈసీ గ్యంబ్లింగ్ అంటూ కవర్ చేసుకునేందుకే ఈ వ్యాఖ్యలు అని అంటున్నారు పలువురు.
ఇక సీఎం కేసీఆర్ భయం కేవలం హుజురాబాద్‌పైనేనా లేదా రాష్ట్రం మొత్తం బలహీనపడుతున్నామన్న అసంతృప్తా అని పలువురు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.