HomeసినిమాBhavadeeyudu Bhagat Singh : ప‌వ‌ర్‌స్టార్ కోసం పూజా హెగ్దే నిరీక్ష‌ణ‌

Bhavadeeyudu Bhagat Singh : ప‌వ‌ర్‌స్టార్ కోసం పూజా హెగ్దే నిరీక్ష‌ణ‌

Pooja Hegde waiting for pawan kalyan Bhavadeeyudu Bhagat Singh movie shoot : ప‌వ‌ర్‌స్టార్ కోసం పూజా హెగ్దే నిరీక్ష‌ణ‌

తెలుగు, త‌మిళ ద‌ర్శ‌కుల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది పూజాహెగ్డే (Pooja Hegde).

ఇప్ప‌టికే రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీ చేస్తున్న ఈ భామ ప్ర‌స్తుతం టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ( Pawan Kalyan ) మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు భ‌వదీయుడు భ‌గ‌త్‌సింగ్ (Bhavadeeyudu Bhagat Singh) చిత్రంలో న‌టించే అవ‌కాశం కూడా కొట్టేసింది.

ఇటీవ‌లే ఓ సినిమా ఫంక్ష‌న్‌లో హ‌రీష్ శంక‌ర్ (Harish Shankar) ఈ విష‌యాన్ని చెప్పాడు.

అయితే ప‌వ‌న్‌కల్యాణ్ రాజ‌కీయ ప‌ర‌మైన కార‌ణాల‌తో ఈ చిత్రం ఆల‌స్యమ‌వుతూ వ‌స్తోంది.

సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంద‌న్న విష‌యంలో అనిశ్చితి నెల‌కొన‌డంతో పూజాహెగ్డేకు నిర్మాత‌లు ఇచ్చే పారితోషికాన్ని పెండింగ్‌లో పెట్టార‌ట‌.

దీంతో పూజాహెగ్డే కూడా త‌న డేట్స్ కేటాయించే విష‌యంలో క్లారిటీగా లేన‌ట్టు వార్త‌లు వస్తున్నాయి.

పెద్ద పెద్ద సినిమాలు పూజాహెగ్డే కోసం లైన్‌లో వేచి ఉన్నా.. కాల్షీట్ల విష‌యంలో మాత్రం ప‌క్కా ప్లాన్ ప్ర‌కారమే ముందుకెళ్తుంది పూజాహెగ్డే.

ఇక ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రాజెక్టుకు అధికారికంగా సంత‌కం చేసే ముందు డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్ నుంచి స్ప‌ష్ట‌త తీసుకోవాల‌ని పూజాహెగ్డే భావిస్తుంద‌ట‌.

ప్ర‌స్తుతం విజ‌య్‌తో క‌లిసి బీస్ట్ చిత్రంలో న‌టిస్తోంది పూజాహెగ్డే.

దీంతోపాటు స‌ల్మాన్ ఖాన్ సినిమా, మ‌హేశ్ బాబు-త్రివిక్ర‌మ్ సినిమాలు కూడా పూజాహెగ్డే ఖాతాలో ఉన్నాయి.

ఒక వేళ ప‌వ‌న్ సినిమా కోసం కొన్ని నెల‌లు డేట్స్ అవ‌స‌ర‌మైతే ఆ షెడ్యూల్ ప్ర‌కారం త‌న కాల్షీట్ల‌ను స‌ర్దుబాటు చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌.

Recent

- Advertisment -spot_img