Homeఅంతర్జాతీయంOmicron variant : కొత్త వేరియంట్‌ను వ్యాక్సీన్లు ఎదుర్కోగలవా, లేకపోతే ఎలా..

Omicron variant : కొత్త వేరియంట్‌ను వ్యాక్సీన్లు ఎదుర్కోగలవా, లేకపోతే ఎలా..

Is existed vaccines work on Omicron variant or not : కొత్త వేరియంట్‌ను వ్యాక్సీన్లు ఎదుర్కోగలవా, లేకపోతే ఎలా..

వేగంగా మ్యుటేషన్ చెందుతున్న కరోనావైరస్ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆందోళనకరంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ సమయంలో అందరి మదిలో ఒక ప్రశ్న పుట్టుకొస్తోంది. కొత్త వేరియంట్‌ను వ్యాక్సీన్ అదుపు చేయగలదా?

ఏమిటీ కొత్త వేరియంట్?

కోవిడ్‌లో వేలకొద్దీ మ్యుటేషన్లు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.

వైరస్‌లు నిత్యం పరివర్తన చెందుతుంటాయి కాబట్టి ఇది ఊహించలేని విషయం కాదు.

కానీ బి.1.1.529 రకం లేదా ఒమిక్రాన్ అని పిలిచే ఈ కొత్త వేరియంట్, ప్రస్తుత వ్యాక్సీన్‌లు పోరాడుతున్న వేరియంట్ కంటే భిన్నమైంది.

అందుకే నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ఈ వేరియంట్‌‌లో జన్యు మార్పులు 50 వరకు ఉన్నాయి. వీటిలో 32 వైరస్ స్పైక్ ప్రోటీన్‌లు ఉన్నాయి.

వాస్తవానికి వ్యాక్సీన్‌లు టార్గెట్ చేసేది వీటినే.

అయితే, ఇది ఎంత ముప్పును కలిగిస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

మరి టీకాలు పని చేస్తాయా?

ప్రస్తుత వ్యాక్సీన్‌లు ఈ వేరియంట్‌కు మ్యాచ్ కావు కాబట్టి అవి పని చేయకపోవచ్చని నిపుణులు అంటున్నారు, అలాగని, అవి పూర్తిగా రక్షణ కల్పించలేవని భావించడానికి వీలు లేదు.

డెల్టా, ఆల్ఫా, బీటా, గామాతో సహా ఇతర ప్రధాన కోవిడ్ వేరియంట్‌ల కారణంగా ఏర్పడే తీవ్ర అనారోగ్యకరమైన పరిస్థితులను అడ్డుకోవడం ద్వారా వ్యాక్సీన్లు ఇప్పటికీ చాలా ప్రభావవంతంగా ఉన్నాన్నది నిపుణులు చెబుతున్న మాట.

అందుకే, తీసుకోవాల్సినన్ని డోసుల టీకాలను తీసుకుని ఉండటం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అమెరికా, బ్రిటన్‌లలో

  • 40 ఏళ్లు దాటినవారు
  • ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది
  • కేర్‌ హోమ్‌లలో ఉండే వృద్ధులు
  • ఆరోగ్యం సరిగాలేని 16-49 సంవత్సరాల వయసు గలవారు
  • ఇతరులతో రూమ్ షేర్ చేసుకునే వయోజనులు

వీరందరికీ బూస్టర్ డోసులను కూడా ఇస్తున్నారు. ఒక్క బ్రిటన్‌లోనే కోటీ 60 లక్షల బూస్టర్ డోసులను ఇప్పటి వరకు ఇచ్చారు.

బ్రిటన్ వ్యాప్తంగా కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు మళ్లీ పెరుగుతున్నా, ఆసుపత్రులలో చేరేవారుగానీ, మరణాల సంఖ్యగానీ మునపటి వేవ్‌ల స్థాయిలో లేదు.

వ్యాక్సీన్ ప్రోగ్రామ్ సక్సెస్ కావడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఈ తాజా వైరస్ మ్యుటేషన్‌పై వ్యాక్సీన్‌లు ఎంత వరకు పని చేస్తాయో తెలుసుకోవడానికి అధికారులు టెస్టులు నిర్వహిస్తున్నారు.

ఇది ప్రారంభమే కాబట్టి, నిపుణులు మ్యుటేషన్‌లను అధ్యయనం చేసి, వ్యాక్సీన్లు ఎంత వరకు రక్షణ కల్పించగలవో చూస్తారు.

అలాగే, ఈ మ్యుటేషన్లు ఎంత వరకు ప్రమాదకరంగా మారతాయో కూడా అంచనా వేస్తారు.

ఈ వేరియంట్‌కు కూడా వ్యాక్సీన్ వస్తుందా?

రూపాంతరం చెందుతున్న వైరస్‌లకు అనుగుణంగా వ్యాక్సీన్‌‌లను రూపొందించి పరీక్షిస్తున్నారు.

తీవ్రమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కొన్ని వారాలలోపే వ్యాక్సీన్‌లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చట్టపరమైన నిబంధనల విషయంలో వేగంగా అనుమతులు సాధించేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఈ వ్యాక్సీన్‌లను వీలైనంత వేగంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వేరియంట్లు ఎంత ప్రమాదకరమైనవి?

కొత్తగా వస్తున్న వేరియంట్లలో ఏవీ తీవ్రమైన సమస్యలకు కారణమైనట్లు ఆధారాలు లేవు.

ఒరిజినల్ కోవిడ్ మాదిరిగానే, వృద్ధులు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఒక వేరియంట్ ఎక్కువగా వ్యాపిస్తే, అది టీకాలు వేయించుకోని వారిలో ఎక్కువ మరణాలకు దారి తీస్తుంది.

కోవిడ్-19 కారణంగా ఏర్పడే తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల నుంచి వ్యాక్సీన్‌లు రక్షణ కల్పిస్తాయి.

ఇందులో ప్రమాదకరం అని చెప్పే వేరియంట్లు కూడా ఉన్నాయి.

టీకాలు వ్యాధి సంక్రమణ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి కానీ, అన్ని ప్రమాదాలను పూర్తిగా తొలగించ లేవు.

ఇన్‌ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడాలన్న సూచన అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది.

చేతులు కడుక్కోవడం, దూరాన్ని పాటించడం, మాస్క్ ధరించడం లాంటివి తప్పకుండా పాటించాలి.

వేరియంట్లు ఎందుకు వస్తున్నాయి?

వైరస్‌లు తమను తాము రీప్రొడ్యూస్ చేసుకోవడానికి కార్బన్ కాపీలను తయారు చేసుకుంటాయి.

కానీ, అందులో ఏర్పడిన లోపాల వల్ల కొత్త వెర్షన్ వైరస్ లేదా వేరియంట్ పుట్టుకొస్తుంది.

మనుగడకు అవకాశం దొరికితే అది వృద్ధి చెందుతుంది.

ఒక వ్యక్తి శరీరంలోకి చేరిన తర్వాత కరోనా వైరస్ తనని తాను రీప్రొడ్యూస్ చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందుకే ఇన్ఫెక్షన్‌లను అరికట్టడం చాలా ముఖ్యం.

వ్యాక్సీన్‌లు వ్యాప్తిని తగ్గించడంతో పాటు తీవ్రమైన కోవిడ్ సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

తాజాగా పుట్టుకొచ్చిన బి.1.1.529 వేరియంట్ కోవిడ్ వైరస్‌తో ఎక్కువ కాలం ఇబ్బందిపడిన వ్యక్తిలో పుట్టుకొచ్చి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img