US Russia relations : అమెరికా – రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణం
US Russia relations : రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వార్నింగ్ ఇచ్చారు.
ఉక్రెయిన్‌తో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నించాలని లేకపోతే ఆంక్షలతో విరుచుకుపడతామని తేల్చిచెప్పారు బైడెన్.
అదే జరిగితే ఇరు దేశాల బంధం బలహీనపడుతుందని పుతిన్ స్పష్టం చేశారు.
వీరి మధ్య దాదాపు గంట పాటు జరిగిన ఫోన్ సంభాషణపై రెండు దేశాలు ప్రకటనలు విడుదల చేశాయి.
అమెరికా- రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఉక్రెయిన్ వ్యవహారంపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం రాజుకుంది.
Worldwide Corona Cases : అమెరికాలో ఒక్కరోజులో 5.6లక్షల కేసులు
Corona Cases In France : ఫ్రాన్స్ లో ఒక్కరోజే లక్ష కరోనా కేసులు నమోదు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సంభాషణ జరిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..
ఉక్రెయిన్‌పై సైనికపరమైన చర్యలు చేపడితే, మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని తేల్చిచెప్పారు.
ఇదే జరిగితే అమెరికా- రష్యా మధ్య మైత్రి మరింత బలహీనపడుతుందని పుతిన్ హెచ్చరించారు.
ఉక్రెయిన్- రష్యా మధ్య సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది.
తాజాగా రష్యా భారీ ఎత్తున బలగాలను మోహరించడం వల్ల సరిహద్దు సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది.
ఈ నేపథ్యంలో అమెరికా- రష్యా దేశాధినేతల ఫోన్ సంభాషణకు ప్రాధాన్యత సంతరించుకుంది.
అమెరికా- రష్యాల మధ్య ఇప్పుడు రెండు దారులు ఉన్నట్టు, ఒకటి దౌత్యపరమైన మార్గమని, మరొకటి ఆంక్షలతో విరుచుకుపడటమని పుతిన్‌కు బైడెన్ తేల్చిచెప్పారు.
Pak Taliban Dispute : పాక్ సైన్యం-తాలిబన్ల మధ్య సరిహద్దు వివాదం
Vladimir putin : మీ ఆటలు మా దగ్గర కాదు.. అమెరికాకు రష్యా హెచ్చరిక..
‘ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు తగ్గించాలని పుతిన్‌ను బైడెన్ కోరారు.
అలా కాకుండా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేస్తే.. మిత్ర దేశాలతో కలిసి అమెరికా తీవ్రంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు.’
అని శ్వేతసౌధం పత్రికా వ్యవహారాల కార్యదర్శి జెన్ సాకి తెలిపారు.
“అమెరికా మరిన్ని ఆంక్షలు విధిస్తే.. అది పెద్ద తప్పే అవుతుందని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బైడెన్‌కు పుతిన్ తేల్చిచెప్పారు,”
అని రష్యా అధ్యక్షుడి విదేశీ వ్యవహారాల సలహాదారు యూరి ఉషకోవ్ తెలిపారు.
బైడెన్- పుతిన్ మాట్లాడుకోవడం.. డిసెంబర్లో ఇది రెండోసారి. మరోవైపు ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారులు.. జనవరి 9న జెనీవాలో భేటీకానున్నారు.
12వ తేదీన రష్యా-నాటో సమావేశం జరగనుంది. వియన్నా వేదికగా.. జనవరి 13న ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కొ-ఆపరేషన్ ఇన్ యూరప్ భేటీ జరగనుంది.
ఆయా భేటీల్లో పాల్గొననున్న రష్యా.. ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవద్దన్న తన డిమాండ్‌ను బలంగా వినిపించే అవకాశముంది.
KFC Chicken : కేఎఫ్‌సీ చికెన్ బాక్స్‌ను తిందామని తెరిచిచూస్తే షాక్..