NTR – Rashmika Mandanna : ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీలో రష్మిక
NTR – Rashmika Mandanna pan india movie : కన్నడ సొగసరి రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అవుతున్నది.
అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఈ భామ జాతీయ సినీ యవనికపై దూసుకుపోతున్నది.
దక్షిణాదిలో తిరుగులేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ‘మిషన్ మజ్ను’ ‘గుడ్‌బై’ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది.
వరుసగా భారీ ఆఫర్లతో కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ సొగసరి తాజాగా తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్లు తెలిసింది.
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
పాన్‌ఇండియా స్థాయిలో ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇందులో కథానాయికగా అలియాభట్, కియారా అద్వానీల్లో ఒకరు నటిస్తారని వార్తలొచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం రష్మిక మందన్నను నాయికగా ఖరారు చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది.
ఇటీవల ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్‌లో మాస్ ప్రేక్షకులకు చేరువైంది రష్మిక మందన్న.
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో ఈ భామకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ సినిమాలో కథానాయికగా ఆమె అయితేనే బాగుంటుందనే నిర్ణయానికొచ్చారని చెబుతున్నారు.
రాజకీయ, సామాజిక అంశాల్ని స్పృశిస్తూ ఎన్టీఆర్-కొరటాల శివ చిత్రం ఉండబోతున్నదని సమాచారం.
Rashmika mandanna