Janasena Membership : జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు
Janasena Membership : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన తన క్రియాశీల సభ్యత్వ నమోదు ఈ నెల 20 (ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది.
ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
క్రియాశీల సభ్యత్వ నమోదు సందర్భంగా శనివారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఆదివారంతో ప్రారంభం కానున్న క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగించనున్నట్టుగా నాదెండ్ల వెల్లడించారు.
కొత్తగా సభ్యత్వ నమోదుతో పాటు పాత సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకునే అవకాశాన్ని పార్టీ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
వారం పాటు సాగనున్న క్రియాశీల సభ్యత్వ నమోదును 5 లక్షల మార్కును దాటేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Rakesh jhunjhunwala : ఒకే రోజులో రూ. 861 కోట్లు సంపద
Financial Security : హైదరాబాద్ లో ఆర్థిక భద్రత తక్కువే!.. మెట్రో నగరాలపై తాజా సర్వే