Governor : తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
Governor : తెలుగు సంవత్సరాది ఉగాది వేళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉగాది పండుగను పురస్కరించుకుని రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా ప్రసంగించిన తమిళిసై కీలక వ్యాఖ్యలుచేశారు.
రాజ్ భవన్ పరిధి ఏమిటో తనకు తెలుసునని, తనను ఎవరూ నియంత్రించలేరని ఆమె చెప్పారు.
తనకు ఎలాంటి ఇగో లేదని కూడా ఆమె తేల్చి చెప్పారు.
Payment Apps : గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లు డబ్బు ఎలా సంపాదిస్తాయి?
వచ్చే నెల నుంచి రాజ్ భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ప్రకటించిన ఆమె.. రాజ్ భవన్‌లో ప్రజలను నేరుగా కలుస్తానని వెల్లడించారు.
ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటానని, ప్రజల కోసం రాజ్ భవన్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలకు తాను సోదరినని, ఉగాది నుంచి తెలంగాణలో నవశకం ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు.
ప్రభుత్వంతో కలిసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.
Apple : రోజుకో ఆపిల్‌తో జీర్ణ సమస్యలకు చెక్
Vizag Airport : విశాఖపట్నం విమానాశ్రయంని ఎందుకు VTZ అంటారు? ఎందుకు VSKP అన్నారు?