Harish Rao : తెలంగాణ దేశానికే దశదిశ చూపుతోంది
Harish Rao : రాష్ట్రవ్యాప్తంగా గులాబీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ ఘనంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా హెచ్ఐసీసీలో 4500 మందికి సరిపోయేవిధంగా ఏర్పాట్లను చేశారు.
ఇప్పటికే హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి ఒక్కొక్కరు చేరుకుంటున్నారు.
అయితే ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందన్నారు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికే దశ దిశ చూపుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆనాడు ఆకలి చావులు, ఆత్మహత్యలతో ప్రశ్నార్థకంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు సుమారు 12 రాష్ట్రాలు వలస వచ్చి పనిచేసుకునేంత ఎత్తుకు ఎదిగిందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెబుతున్న డబుల్ ఇంజన్ ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస కూలీలు వస్తున్నారన్నారు.