Homeస్పోర్ట్స్Michael Vaughan : వెళ్లి రెస్ట్ తీసుకో కోహ్లీ

Michael Vaughan : వెళ్లి రెస్ట్ తీసుకో కోహ్లీ

Michael Vaughan : వెళ్లి రెస్ట్ తీసుకో కోహ్లీ

Michael Vaughan : విరాట్ కోహ్లీ ఫామ్ ను కోల్పోయి వరుస విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

అయినా, టీమిండియా కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సైతం ఇటీవలే కోహ్లీకి మద్దతుగా స్వరం వినిపించాడు.

కోహ్లీ సెంచరీలు చేయాల్సిన అవసరం లేదని, జట్టు విజయానికి అవసరమైన మేర ఇన్నింగ్స్ ఆడితే చాలని కూడా చెప్పాడు.

అయితే, ఇంట్లో మద్దతు, వీధిలో విమర్శలు అన్న చందంగా కోహ్లీ పరిస్థితి ఇప్పుడు తయారైంది.

గత రెండు మూడేళ్ల కెరియర్ లో కోహ్లీ సాధించింది పెద్దగా ఏమీ లేదు.

ఐపీఎల్ లో కూడా పేలవ ప్రదర్శనతోనే నెట్టుకొస్తున్నాడు.

ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అయిన మైఖేల్ వాన్ కోహ్లీకి ఓ ఉచిత సలహా ఇచ్చాడు.

కనీసం ఓ మూడు నెలలు అయినా కోహ్లీకి విశ్రాంతి అవసరమన్న అభిప్రాయాన్ని వాన్ వ్యక్తం చేశాడు.

కుటుంబంతో అతడు తగినంత సమయం గడపాల్సిన అవసరాన్ని ప్రస్తావించాడు.

‘‘కోహ్లీకి ఐపీఎల్ తర్వాత కొంత విశ్రాంతి లభించింది. అయినా, అతడు మరింత విశ్రాంతి కావాలన్నట్టు కనిపిస్తున్నాడు. క్రికెట్ నుంచి కనీసం మూడు నెలల విశ్రాంతి అతడికి అవసరం అనిపిస్తోంది. అందుకే వెళ్లి బెంచ్ పై కూర్చోవడం నయం’’ అని వాన్ పేర్కొన్నాడు.

‘‘వెళ్లి నీ కుటుంబంతో ఏమి చేయాలని అనకుంటున్నావో చేయి. 20 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో మూడు నెలల బ్రేక్ అతడికి నష్టం చేస్తుందా? అలాంటి అవకాశం లేదు. కానీ, ఈ బ్రేక్ అతడికి మేలు చేస్తుందా? అంటే చేస్తుందనే చెబుతాను’’ అని వాన్ పేర్కొన్నాడు.

33 ఏళ్ల కోహ్లీ ఖాతాలో 8,000 పరుగులు సహా ఎన్నో రికార్డులు ఉన్నాయి.

అయినా, 2019లో బంగ్లాదేశ్ పై చేసిందే చివరి సెంచరీ కావడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img