Homeవిద్య & ఉద్యోగంDeloitte India : డిగ్రీతో డెలాయిట్‌లో ఉద్యోగాలు.. అర్హత, దరఖాస్తు ఇలా..

Deloitte India : డిగ్రీతో డెలాయిట్‌లో ఉద్యోగాలు.. అర్హత, దరఖాస్తు ఇలా..

Deloitte India : డిగ్రీతో డెలాయిట్‌లో ఉద్యోగాలు.. అర్హత, దరఖాస్తు ఇలా..

Deloitte India : ప్రముఖ ఎంఎన్సీ (MNC) కంపెనీ డెలాయిట్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. పోస్టును బట్టి అర్హత ప్రమాణాలు ఉండాలి.

కన్సల్టెన్సీ ఫర్మ్స్ డెలాయిట్ ఇండియాలో కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్ లేదా లాలో గ్రాడ్యుయేట్ (Graduate) అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అంతే కాకుండా.. కంపెనీ రెగ్యులేటరీ బృందం డిప్యూటీ మేనేజర్ ట్యాక్స్ మెర్జర్ అండ్ అక్విజిషన్ (డిప్యూటీ మేనేజర్ జాబ్) పోస్ట్ కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

వీటికి సెలెక్ట్(Select) అయిన వారు బెంగళూరు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

అర్హతలు..

కంపెనీ సెక్రటరీ ఉద్యోగానికి డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

అదే సమయంలో.. చార్టర్డ్ అకౌంటెన్సీ మరియు/లేదా బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రీవియస్ కంపెనీలో కనీసం 2-3 మంది వ్యక్తుల బృందానికి నాయకత్వం వహించిన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఉద్యోగ పాత్ర

కంపెనీల చట్టం 2013, FEMA, SEBI (SEBI నిబంధనలు), NBFC (బ్యాంకింగ్ నిబంధనలు), LLP (పరిమిత బాధ్యత భాగస్వామ్యం), స్టాంప్ డ్యూటీ, కాంపిటీషన్ యాక్ట్ కన్సల్టింగ్ మరియు క్లయింట్‌తో సహా ఇతర కార్పొరేట్ చట్టాలకు సంబంధించి సహకరించడం.

రెగ్యులేటరీ బృందంలో భాగంగా ఉండటం, కంపెనీకి మరియు క్లయింట్‌కు సలహా ఇవ్వడం.

కార్పొరేట్ చట్టానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడం.

విలీనం, డీ-మెర్జర్, ప్రాజెక్ట్ నిర్వహణ, పర్యవేక్షణ, ముందస్తు సమీక్ష మొదలైన విషయాలలో ఖాతాదారులతో వ్యవహరించడం.

ప్రభుత్వం మరియు ఇతర నియంత్రణ సంస్థలు జారీ చేసే పేపర్లు, బిల్లులు, విధానాలపై నిరంతరం నిఘా ఉంచడం మరియు ఖాతాదారులను అప్‌డేట్ చేయడం.

దరఖాస్తు ఇలా..

మొదట అధికారికి వెబ్ సైట్ ఓపెన్ చేయండి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తర్వాత వెబ్ పేజీలో కనిపిస్తున్న అప్లై ఆన్ లైన్ ను ఎంచుకోవాలి.

ఇక్కడ అప్పటికే రిజిస్టర్ అయి ఉంటే.. ఈ మెయిల్ ఐడీ, పాస్ వర్ట్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. లేదంటే.. ఇక్కడ క్లిక్ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి.

చివరగా అక్కడ ఇచ్చిన వివరాలను నింపి దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

Recent

- Advertisment -spot_img