ED RIDES:
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఢిల్లీ నగరంతోపాటు గుర్గావ్, లక్నో, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే 30 చోట్ల వేర్వేరు బృందాలుగా ఏర్పడిన ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న రామచంద్రన్ పిళ్ళై నివాసం, ఆఫీసు, ఆయనకు చెందిన రాబిన్ డిస్టిల్లరీలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇతనితో సంబంధం ఉన్న సృజన్ రెడ్డి, అభిషేక్‌రావు, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉన్నదంటూ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్‌రావు నివాసంలోనూ సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వర్గాలు ప్రాథమిక సమాచారం ఇవ్వడం గమనార్హం. ఎమ్మెల్సీ కవితకు అభిషేక్‌రావు సన్నిహితులుగా ఉన్నందునే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.