HomeజాతీయంPM MODI NETAJI STTUE: ఇండియా గేట్ వద్ద భారీ నేతాజీ విగ్రహం.. ఖమ్మం...

PM MODI NETAJI STTUE: ఇండియా గేట్ వద్ద భారీ నేతాజీ విగ్రహం.. ఖమ్మం నుంచి భారీ శిల

PM MODI NETAJI STTUE: నేతాజీ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ. స్వతంత్ర పోరాటం లో నేతాజీ ఘనతను చాటిచెప్పేందుకు ఇండియాగేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఇందుకోసం 1,685 కిలోమీ టర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా నుంచి 140 చక్రాలు: గల 100 అడుగుల లారీలో 280 మెట్రిక్ టన్నుల ఏక శిల గ్రానైట్ రాయిని దిల్లీకి తెప్పించారు. సుమారు 28 వేల గంటలు శ్రమించి కళాకారులు 65 మెట్రిక్ టన్నుల బరువున్న 28 అడుగుల విగ్రహానికి ప్రాణం పోశారు. కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత యువ కళాకారుడు అరుణ్ యోగిరాజ్ ఆధ్వర్యంలో ఆధునిక పరికరాలు ఉపయో గించి పూర్తి భారతీయ సంప్రదాయపద్ధతిలో ఈ విగ్ర హాన్ని తీర్చిదిద్దారు. ఇది దేశంలోని ఎత్తైన ఏకశిలా విగ్రహం.
ఖమ్మం జిల్లా నుంచి
తెలంగాణలోని ఖమ్మం జిల్లా గ్రానైట్ మరోసారి దేశరాజధాని హస్తినలో మెరువనుంది. ఇప్పటికే నేషనల్ పోలీస్ మెమోరియల్, మాజీ ప్రధాని వాజ్ పాయి సమాధిపై నిక్షిప్తమైన నల్లని గండుశీల ఇప్పుడు 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం తయారీలో ఉపయోగించారు.

Recent

- Advertisment -spot_img