HomeతెలంగాణGrahanam:సూర్య గ్రహణం వివరాలు ఇవే.. దీపావళి పండుగ మీద స్పష్టత

Grahanam:సూర్య గ్రహణం వివరాలు ఇవే.. దీపావళి పండుగ మీద స్పష్టత

Grahanam :

ఈ సంవత్సరం (2022)లో ఇది రెండవద సూర్యగ్రహణం. దీపావళి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో గ్రహణం ఏర్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సారి పాక్షిక సూర్యగ్రహణం 25 వ తేదీ అక్టోబర్ 2022న భారత్‌లో సూర్యగ్రహణం ఏ నగరంలో ఎప్పుడు కనిపిస్తుందో తెలుసుకుందాం.

అక్టోబర్ 25వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం ఐరోపా, ఈశాన్య ఆఫ్రికా మరియు పశ్చిమాసియాలోని వివిధ ప్రాంతాల్లో దర్శనమివ్వనుంది.భారత్‌లో కూడా పలు నగరాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది.ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ఉజ్జయిని, వారణాసి మధుర, హైదరాబాద్‌లతో పాటు మరికొన్ని నగరాల్లో సూర్య గ్రహణాన్ని మనం చూడవచ్చు.హైదరాబాదులో సాయంత్రం 4:59 గంటలకు ప్రారంభమై 5:48 నిమిషాలకు ముగుస్తుంది

  • గ్రహణం యొక్క వ్యవధి (ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు) ఢిల్లీ మరియు ముంబై రెండింటికీ వరుసగా 1 గంట 13 నిమిషాలు మరియు 1 గంట 19 నిమిషాలు ఉంటుంది.

అసలు సూర్యగ్రహణం అంటే ఏంటి..?

సూర్యునికి మరియు భూమికి మధ్య చంద్రుడు వచ్చి కొంత సమయం వరకు సూర్యకాంతిని భూమికి చేరకుండా అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.దీంతో చంద్రుడి నీడ భూమిపై పడి సూర్యుడిలోని కొంత భాగం కనిపించదు. సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు. గ్రహణం వీక్షించేందుకు ప్రత్యేక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అల్యూమినైజ్డ్ మైలార్, బ్లాక్ పాలిమర్, వెల్డింగ్ గ్లాసెస్ వంటివాటితో సూర్య గ్రహణాన్ని చూడవచ్చు.

Recent

- Advertisment -spot_img