Homeతెలంగాణ(Wanaparthy) :క్షణికావేశంలో కన్న కూతురిని కడతేర్చిన తండ్రి

(Wanaparthy) :క్షణికావేశంలో కన్న కూతురిని కడతేర్చిన తండ్రి

(Wanaparthy) : ప్రేమ అనే పేరుతో తమ కుటుంబం పరువు తీస్తోందని కన్న కూతురిని పదునైన ఆయుధం తో పొడిచి చంపిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో జరిగింది.పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… పాతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్, సునీత దంపతుల… కూతురు పెబ్బేరు (Wanaparthy) లో 10వ తరగతి చదువుతుంది.. కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోందనే అనుమానంతో మంగళవారం ఉదయం ఇదే విషయంపై తండ్రి కూతురు మధ్య గొడవ జరిగింది. ఊర్లో కుటుంబ పరువు తీస్తున్నావాని క్షణికావేశంలో తండ్రి రాజశేఖర్…… చేతికి దొరికిన పదునైన ఆయుధం తో గొంతు కోసి చంపాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన డిఎస్పి ఆనంద్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. (Wanaparthy)

Recent

- Advertisment -spot_img