HomeతెలంగాణJUNIOR NTR:ఎన్టీఆర్ హీరో కాకపోతే..?

JUNIOR NTR:ఎన్టీఆర్ హీరో కాకపోతే..?

JUNIOR NTR:నిన్ను చూడాలని అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఈయనకు నందమూరి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ సపోర్ట్ ఏమాత్రం తీసుకోకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారారు. అయితే మొదట్లో నందమూరి ఫ్యామిలీ అంతగా ఈయన ను పట్టించుకునేది కాదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.. అంతే కాదు నందమూరి ఫ్యామిలీ ఆదరణ కోసం చాలా రోజులు ఆసక్తిగా ఎదురుచూసిన రోజులు ఉన్నాయి.ఆయన సినిమాల్లో స్టార్ హీరోగా మారినప్పుడయినా అంత సంతోషం కలగలేదు. కానీ ఎప్పుడైతే నందమూరి ఫ్యామిలీ ఆదరించిందో అప్పుడు మాత్రం జూనియర్ కళ్ళలో ఆనందం మరోలా ఉందట. ఎందుకంటే ఆయన సినిమాలకంటే ఎక్కువగా కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇదిలా ఉంటే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఈయన కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత వరుసగా సింహాద్రి, ఆది,నాగ, సాంబ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు.

ఇక ఈ మధ్యకాలంలో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో హీరో అయిపోయారు.అయితే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకపోతే ఏం అయ్యేవాడు అని చాలామంది అభిమానులు భావిస్తారు.అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ నేను సినిమాల్లోకి రాకపోతే వ్యాపారవేత్తగా సెటిల్ అయ్యేవాడిని.

అయితే నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి వ్యాపారవేత్తగా సెటిల్ కాకపోయి ఉంటే సినిమాల్లోకి వచ్చి నటుడిగా రాణించకపోయినా కనీసం లైట్ బాయ్ గానైనా సినిమాల్లో ఉండేవాడిని అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి చాలా మంది నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Recent

- Advertisment -spot_img