Homeఫ్లాష్ ఫ్లాష్IPL 16:టాస్ గెలిచిన గుజరాత్.. చెన్నై బ్యాటింగ్

IPL 16:టాస్ గెలిచిన గుజరాత్.. చెన్నై బ్యాటింగ్

IPL 16:గుజరాత్ టీం టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ధోని సేన తొలుత బ్యాటింగ్ చేయనుంది. బాలీవుడ్ తారల ప్రదర్శన అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు రంగంలోకి దిగారు. గత విజేత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రోఫీతో మైదానంలోకి వచ్చాడు. ప్రారంభోత్సవంలో నటి రష్మిక మందన్న, తమన్నా భాటియా, అరిజిత్ సింగ్ వంటి స్టార్లు స్టేడియాన్ని షేక్ చేశారు. ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు. పాటలు, డ్యాన్స్‌ల తర్వాత స్టేజ్ పైకి గుజరాత్, చెన్నై టీంల సారథులు హార్దిక్, ధోని ఎంట్రీ ఇచ్చారు. మండు వేసవిలో పరుగుల విందును అందించే మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2023.. 16 వ సీజన్ ఇవాళ మొదలవబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీ కొట్టనుంది. 10 టీంలు, 70 మ్యాచులు ఆడనున్నాయి. హైదరాబాద్ హోం టీం సన్ రైజర్స్ హైదరాబాద్… తొలి మ్యాచ్ ఏప్రిల్ 2న రాజస్థాన్ తో తలపడనుంది. మిగతా మ్యాచులు ఎప్పుడో ఐపీఎల్ షెడ్యూల్ లో చూద్దాం. 

ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌

Recent

- Advertisment -spot_img