Homeఅంతర్జాతీయంGAS:తగ్గనున్న వంట గ్యాస్, సీఎన్జీ ధర

GAS:తగ్గనున్న వంట గ్యాస్, సీఎన్జీ ధర

GAS: వంట గ్యాస్, సీఎన్జీ ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు గ్యాస్ ధరల మార్గదర్శకాలకు సవరణలు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అంతర్జాతీయ ధరలతో సంబంధం లేకుండా గ్యాస్ ధరలు భారతీయ క్రూడ్ మార్కెట్తో అనుసంధానం కానున్నాయి. సహజ వాయువు ధర భారతీయ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో పది శాతం ఉంచాలని నిర్ణయించింది. స్థిరమైన ధరను నిర్ధారించడానికి కొత్త విధానాన్ని అమలు చేయనుంది. దీంతో నెలవారీగా గ్యాస్ రేట్ల నిర్ణయించనున్నారు. ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రజలకు,  ఉత్పత్తిదారులకు ఉపశమనం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Recent

- Advertisment -spot_img