Homeఅంతర్జాతీయంSachin new car:సచిన్ కొడుకు కోసం ఖరీదైన కారు -ఎన్ని కొట్లో తెలుసా?

Sachin new car:సచిన్ కొడుకు కోసం ఖరీదైన కారు -ఎన్ని కొట్లో తెలుసా?

Sachin new car:భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కు కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్క ర్లేదు. ఇప్పటికే అతని వద్ద బీఎండబ్ల్యూ 7 సిరీస్ ఎల్ఐ, బీఎండబ్ల్యూ ఎక్స్5ఎం, బీఎండబ్ల్యూ ఐ8, బీఎండబ్ల్యూ 5 సిరీస్, పోర్షె 911 టర్బో ఎస్, ఫెరారీ 360 మోడెనా వంటి ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా సచిన్‌ మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇటలీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లాంబోర్ఘినికి చెందిన లేటెస్ట్ మోడల్ ఉరుస్ ఎస్ ను కొనుగోలు చేశారు. ఇది తన కొడుకు అర్జున్ టెండూల్కర్ కోసం కొన్నట్లు తెలిసింది

ఉరుస్ ఎస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ 4.18 కోట్లు కాగా, ఎన్నో అధునాతన ఫీచర్లు దీని సొంతం. సచిన్ కొత్త కారులో వెళ్తున్న దృశ్యాలను సీఎస్‌ 12 వోల్గ్స్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌ పోస్ట్ చేసింది. లిటిల్ మాస్టర్ వద్ద ఖరీదైన కార్లు ఎన్ని ఉన్నప్పటికీ.. వాటిలో ముంబై రోడ్లపై తిరగడం కనిపించదు. కాగా, సచిన్‌కు మారుతి 800 అంటే చాలా ఇష్టం. క్రికెట్ లోకి వచ్చిన కొత్తలో ఓ మారుతి 800 కారు కొన్నాడు. అప్పటి నుంచీ అతని ఇంట్లోని కార్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆ కారు ఇప్పటికీ అతని గ్యారేజీలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

Recent

- Advertisment -spot_img