Homeఅంతర్జాతీయంAdipurush:అత్యద్భుతంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Adipurush:అత్యద్భుతంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Adipurush:యుగ యుగాలకు గుర్తుండిపోయేలా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యద్భుతంగా నిర్వహించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ప్రభాస్, కృతి సనన్ మరియు సైఫ్ అలీఖాన్ ప్రదాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక విడుదలకు ముందు, మేకర్స్ సినిమా ప్రమోషన్ విషయంలో విపరీతమైన శ్రద్ధ వహిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ప్రమోషన్స్ అన్నీ చాలా వినూత్నంగా ప్లాన్ చేశారు . ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది . ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ ఈవెంట్ కు లక్షలాది ఫాన్స్ విచ్చేసారు. టీ సిరీస్ మరియు యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాను, తెలుగు ప్రేక్షకులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అందిస్తున్నారు.. ఇక ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్ తో పాటు ముఖ్య అతిథి గా ప్రముఖ ఆద్యాథ్మిక గురు చిన్న జియర్ స్వామి గారు హాజరయ్యారు. పూర్ణ కుంభం తో ఆహ్వానిస్తూ ప్రభాస్ దగ్గరుండి వేదిక వద్దకు తీసుకువచ్చారు.

ట్రైలర్ ఇలా..

2 నిమిషాల 20 సెకన్ల ట్రైలర్ లో రామ -రావణ యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు.  భిక్షాందేహి అంటూ రావణుడు జానకిమాతను తీసుకెళ్లే సంఘటనతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ సీన్ రావణుడిని అతి భయంకరంగా చూపించారు. ఈ సమయంలో వస్తున్నా రావణా..న్యాయం రెండు పాదాలతో నీ పదితలల అన్యాయాన్ని అణచివేయడానికి వస్తున్నా..నా జానకిని తీసుకెళ్లడానికి అంటూ రాఘవుడు చెప్పే డైలాగ్ కు  గూస్ బంప్స్ రావాల్సిందే. 

నా ఆగమనం..ఆధర్మ విధ్వంసం..అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ లో యాక్షన్ సీన్స్ అదుర్స్ అనిపిస్తాయి. కానీ ఈ రోజు నాకోసం పోరాడొద్దు..భరతఖండంలో పరస్త్రీ మీద చేయివేయాలని దుష్టులకు మీ పౌరుష పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నులో వణుకు పుట్టాలి..పోరాడతారా అంటూ చెప్పే డైలాగ్ విజిల్స్ వేయిస్తుంది. 
 
రాఘవుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే సీన్  హైలెట్.  నేను ఇక్ష్వాకు వంశోద్భవ రాఘవ..నీపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి  వివక్షుడినై ఉన్నానంటూ ప్రభాస్ చెప్పే భారీ డైలాగ్ ..సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. చివర్లో ఈదశకంఠుడు పది మంది రాఘవుల కన్నా ఎక్కువ అంటూ రావణుడిగా సైఫ్ చెప్పే డైలాగ్..దీనికి బదులుగా..పాపం ఎంత బలమైనదైనా..అంతిమ విజయం సత్యానిదే అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ తో … ఫైనల్ యుద్దం ఎంత భీకరంగా ఉంటుందో  అర్థం చేసుకోవచ్చు.

హనుమాన్ కోసం ప్రతీ థియేటర్ లో ఒక సీటు ఖాళీగా

దర్శకుడు ఓంరౌత్ కోరిక మేరకు హనుమంతుడి కోసం ఆదిపురుష్ ప్రతిషో కు ఒక సీటు ఖాళీగా ఉంచాలని కోరారు. తన అమ్మ చెప్పేదని రాముడి ప్రదర్శన కోసం హనుమంతుడు తప్పక వస్తాడని చెప్పారని, అదే నమ్మకంతో సీటు ఖాళీగా ఉంచాలని కోరుతున్నాననని చెప్పారు .దీనికి ప్రభాస్ మద్దతు తెలుపగా నిర్మాతలు అంగీకరించారు.

Recent

- Advertisment -spot_img