Homeఅంతర్జాతీయంAIVA:వెలమల సమ్మిళిత అభివృద్దే మా లక్ష్యం - ఐవా అధ్యక్షుడు కే .పాపారావు

AIVA:వెలమల సమ్మిళిత అభివృద్దే మా లక్ష్యం – ఐవా అధ్యక్షుడు కే .పాపారావు

AIVA:వెలమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ అధ్యక్షుడు కే .పాపారావు అన్నారు. ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ పద్మ నాయక వెలమ ఆత్మీయ సమ్మేళనమునకు మా మన ఐవా మీద ప్రేమతో మరియు అభిమానంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వెలమ బంధువులందరికీ సగౌరవంగా పాపారావు స్వాగతము పలికారు
మీ ఆశీర్వాదంతో ప్రస్తుత కమిటి మీ ముందున్నదని , వెలమ సంఘానికి సేవ చేసే అవకాశము కలిగించినందుకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామని పాపారావు అన్నారు . అందరి సమక్షములోనే గత సెప్టంబర్ 27 న మా కమిటి బాధ్యతలు తీసుకున్నామని , అనేక వెలమ సామాజిక వర్గ ప్రయోజనాలు కలిగించే కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు . భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు . కమిటీ భాద్యతలు తీసుకున్ననాటి నుంచి ఇప్పటివరకు కమిటీల పునర్నిర్మాణం చేయడం జరిగిందని అన్నారు అందరి సహకారముతో కేవలము సంక్షేమ కార్యక్రమాలే కాకుండా , సంఘ అభివృద్ధి కార్యక్రమలను విజయవంతంగా నిర్వహిస్తూ మన వెలమ బంధువుల మన్ననలు పొందుతున్నట్లు తెలిపారు . మా కమిటి చేస్తున్న కార్యక్రమాల గురించి వివరాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, వెలమ వైజయంతి ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ విషయాలను సోదరి, మహిళా సభ్యురాలు బొంత గోమతి ప్రెజెంటేషన్ ద్వారా సవివరంగా అందరికీ తెలియ చేసిందన్నారు .అందుకు గోమతి కి కృతఙ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో వెలమ బంధువులందరి సహకారముతో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయని అన్నారు .
ప్రాధాన్యతలు
ఖానామెట్ 5 ఎకరాలలో మల్టీ పర్పస్ బిల్డింగ్ నిర్మాణము, శ్రీశైలంలో అదనపు భవన నిర్మాణము, జలగం వెంగళరావు బాయ్స్ హాస్టల్ గదులు రెనోవెట్ చేయడము, తండ్రి లేని పేద వెలమ విద్యార్థులకు అడాప్ట్ ఎ స్టూడెంట్, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ మరియు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోరకు ప్రిపేర్ అయ్యే వారికి సహకారము, వివిధ క్రీడల నందు నైపుణ్యం కలిగిన వారికి జాతీయస్థాయిలో రావడానికి సహాయం అవుతుందని అన్నారు ముఖ్య మంత్రి కెసిఆర్ గత కమిటి టర్మ్ లో హైటెక్ సిటీ నందు ఐవాకు కేటాయించిన అయిదు ఎకరాల స్థలమునకు మల్టీ పర్పస్ ఐకానిక్ బిల్డింగ్ నిర్మించడమే మా తక్షణ కర్తవ్యమని అన్నారు ఇందులో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. డిజిటల్ లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఇండోర్ గేమ్స్ & హెల్త్ ఫిట్నెస్,యోగా & కల్చరల్ సెంటర్. పేషంట్ అటెండెంట్స్ కోరకు రూమ్స్ మరియు ఇతర సదుపాయాలు ఉండేలా కన్ స్ట్రక్షన్ ప్లాన్ ఉంటుంది దీని వల్ల నిరంతర ఆదాయము మరియు సంక్షేమం ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు . తాండ్రపాపారాయ శ్రీశైలము చౌల్త్రి వడ్డేపల్లి నర్సింగ్ రావ్ మాధవరం రంగారావు సహకారంతో మొదలు పెట్టిన శ్రీశైలం చోల్ట్రి భవనములు, ఆ తర్వాత వచ్చిన ఐవా అధ్యక్ష్యలు వారి కమిటీలు నిర్మించిన కాటేజీలు భవనాలు అన్ని కలిపి 116 రూమ్స్ అందు బాటులో ఉన్నాయన్నారు వీటికి అదనంగా నిర్మిస్తున్న 36+12 గదుల భవనం మూడవ స్లాబ్ కు సిద్దంగా ఉన్నదని వెల్లడించారు . దాతల సహాయముతో ఇట్టి నిర్మాణము పూర్తి చేసి వచ్చే శివరాత్రి లోపే భక్తులకు వినియోగం లోకి తెస్తామని , దీని వలన ఐవాకు అదనపు ఆదాయం చేకూరుతుందన్నారు

జేవీఆర్ హాస్టల్ ప్రత్యేకం

మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన జేవీఆర్ హాస్టల్ భవనాన్ని ,పూర్వ విద్యార్థుల పూర్తి అర్థిక సహాయముతో ఒక్కో రూం సుమారు 80000 రూపాయల వ్యయముతో రూమ్స్ ఫేజ్ వాయిస్ అధునికరిస్తున్నామన్నారు. దీనికి సహకరిస్తున్న ఓల్డ్ స్టూడెంట్స్ కు ధన్య వాదాలు తెలిపారు జేవీఆర్ హాస్టల్ నందు తండ్రీ లేని పేద విద్యార్థులు 20 మందికిఉచిత భోజన వసతి 10 మందికి ఉచిత వసతి కల్పిస్తామని అన్నారు అలాగే జూపల్లి బాలమ్మ గర్ల్స్ హాస్టల్ నందు కూడా అర్హులైన విద్యార్థినులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు పాపారావు వెల్లడించారు .సివిల్ సర్వీసెస్,గ్రూప్స్ మరియు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోరకు ప్రిపేర్ అయ్యే వెలమ ఉద్యోగార్థులకు ప్రోత్సహించడానికి లాంగ్ టర్మ్ బేసిస్ లో హాస్టల్ నందు ప్రతి ఏటా 10 మందికి ఉచితంగా భోజన వసతి కల్పిస్తూ వారు వారికి కాంపిటీటీవ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కు సహకరిస్తామని చెప్పారు


క్రీడలకు ప్రోత్సాహం
వివిధ క్రీడల నందు నైపుణ్యం కలిగిన వారికి జాతీయ అంతర్జాతీయస్తాయిలోకి పాల్గొనడానికి స్పాన్సర్స్ ద్వారా సహకరిస్తామని తెలుపుతున్నామన్నారు . విలు విద్యలో అత్యంత ప్రతిభ కలిగిన కుమారి చికితకు ఐవా కొంత ఆర్థిక సహయమిస్తు, రహేజా IT పార్క్ CEO గోనె శ్రావన్ గారి సహకారముతో చికిత కు 5 లక్షల స్పాన్సర్ షిప్ ఇస్తున్నారన్నారు. వారికి ఐవా తరఫున కృతజ్ఞతలు తెలిపారు
కుమారి రిత్విక స్విమ్మింగ్ లో బాల్యం నుండే అత్యంత ప్రావీణ్యం కల్గి ఉండి రాష్ట్ర జాతీయ స్థాయిలనందు ప్రతిభను కనబరుస్తుంది భవిష్యత్ లో అంతర్జాీయ స్థాయిలోకి వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది, రిత్వీకకు యర్రగొండపాలం సతీష్ NRI ద్వారా లక్ష రూపాయలు మరియు నా స్వయాన 90000 విలువైన స్విమ్ సూట్స్ కు ఐవా ద్వారా కొంత అర్థిక సహాయము చేశాము.రిత్వీక కు స్పాన్సర్షిప్ కొరకు చూస్తున్నామన్నారు

Recent

- Advertisment -spot_img