Homeఫ్లాష్ ఫ్లాష్Delhi:కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో-రాహుల్ గాంధీ-హస్తం గూటికి పొంగులేటి, జూపల్లి

Delhi:కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో-రాహుల్ గాంధీ-హస్తం గూటికి పొంగులేటి, జూపల్లి

Delhi:తెలంగాణ రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల భేటీ ముగిసింది. వారివురూ ఢిల్లీలో అరగంటకుపైగా రాహుల్‌తో చర్చించారు. జులై 2న ఖమ్మం రావాలని రాహుల్‌ని పొంగులేటి ఆహ్వానించారు. దీంతో ఆ రోజు ఖమ్మంలో జరిగే సభలో రాహుల్ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంతో ముందుకు సాగాలని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ సూచించారు. తెలంగాణ నేతలతో రాహుల్ భేటీ సందర్భంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేశారు. నేతలంతా గ్రూప్ ఫొటో దిగిన అనంతరం రాహుల్‌తో కలిసి పొంగులేటి మరోసారి ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ కార్యక్రమానికి పొంగులేటి, జూపల్లి అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్ మంచి జోష్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీకి జీవం వచ్చినట్టైంది. అప్పటిదాకా అంతంతమాత్రాన ఉన్న ఆ పార్టీ పరిస్థితి.. కర్ణాటక రిజల్ట్స్‌తో మొత్తం సీనే మారిపోయింది. కర్ణాటక విజయంతో మంచి ఊపు మీద ఉన్న ఆ నేతలంతా తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటుపై గురి పెట్టారు. దీంతో ఆ పార్టీ రోజురోజుకి పుంజుకుంటోంది. ప్రస్తుతం చేరికలతో స్పీడ్ అందుకుంది. తాజాగా పొంగులేటి, జూపల్లి హస్తం గూటికి చేరుతుండగా.. ఈ ఊపు ముందు ముందు మరింత వేగంగా ఉంటుందని నేతలు చెప్పుకొస్తున్నారు. మరికొందరు ఇతర పార్టీ వాళ్లు కాంగ్రెస్‌లో చేరతారని చెప్పుకొస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే.. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో కూడా భారీగానే కసరత్తు చేసినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే కొంత మంది అభ్యర్థుల ఎంపిక జరిగిపోయినట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ కాంగ్రెస్‌లో 60 సీట్లు ఖరారు అయిపోయాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వారంతా ఎవరి స్థానాల్లో వారు పని చేసుకుంటున్నారని తెలిపారు.

Recent

- Advertisment -spot_img