Homeఫ్లాష్ ఫ్లాష్BJP_CONGRESS:వివేక్ .. రఘునందన్ రావు ఎక్కడ -దారెటు ?

BJP_CONGRESS:వివేక్ .. రఘునందన్ రావు ఎక్కడ -దారెటు ?

BJP_CONGRESS:బీజేపీ నాయకుడు రఘునందన్ రావు , వివేక్ వెంకట స్వామి బీజేపీ కార్యక్రమాల్లో కనబడటం లేదు? . అస్సలు బీజేపీ గురించి మాట్లాడటం లేదు. ఎప్పుడూ ప్రజా క్షేత్రంలో ఉండే రఘునందన్ రావు కూడా కార్యక్రమాలకు అంటీముట్టనట్లు ఉండటంతో అనేక ఊహగాహనాలు వెలుపడుతున్నాయి .ప్రతిపక్షాలపై విరుచుకుపడే రఘునందన్ రావుకు పార్టీలో ప్రాధాన్యత లేక పోవడం వల్లే దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ .. ఇది కాకుండా ఇంకా ఎదో ఇంటర్నల్ గా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేక్ వెంకటస్వామి విషయానికి వస్తే కొంత మెతక వైఖరి కలిగిన వ్యక్తిగా పేరున్నప్పటికీ ….ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రఘునందన్ రావుకు ఏమైందని చర్చ రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్రంగా జరుగుతున్నది..

బీజేపీ పార్టీ కి కరుడు కట్టిన కార్యకర్తలా , నాయకునిగా వ్యవహరిస్తూ అసెంబ్లీలో పాలక పక్షాన్ని అనేకసార్లు ఇరుకున పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కు టార్గెట్ అయ్యాడు . హరీశ్ , కేటీఆర్ తో నువ్వా నేనా అన్నట్లు పోరాడేవాడు .సందు దొరికితే చాలు ఉతికి ఆరేసేవాడు . మంత్రులు చేస్తున్న భూకబ్జాలు , అవినీతి మీద ఆధారాలతో సహా బయటపెట్టి బీజేపీ గ్రాఫ్ పెంచేలా ప్రయత్నించేవాడు. అవుటర్ రింగ్ రోడ్డు లీజు వ్యవహారం లో తీవ్రంగా ప్రభుత్వంతో విభేదించాడు . కానీ ఇక్కడే ఎదో మతలబు జరిగిందనే ప్రచారం ఉంది. ఈ వ్యవహారంలో స్వంత పార్టీ నేతలకు రఘునందన్ రావు మధ్య విభేదాలు పొడచూపాయనే ప్రచారం ఉంది . ఇక్కడనుంచి అలక వహించారని స్వంత పార్టీ నేతలు అంటున్నారు. ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంత మంది నాయకులు పని గట్టుకుని ఢిల్లీ లెవెల్ లో రఘునందన్ రావును దెబ్బగొట్టేందుకు బీఆర్ఎస్ కు కోవర్టు గా పని చేస్తూ లీకులు ఇస్తున్నారని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం . కేసీఆర్ … రఘునందన్ రావు సామాజిక వర్గం ఒకటే కావడంతో అధిష్టానం కూడా కొంత అనుమానంతో ఉన్నట్లు తెలిసింది . ఇది తెలిసిన రఘునందన్ రావు నొచ్చు కున్నట్లు సమాచారం . అందుకే కొంచెం దూరం పాటిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది .
ఇక వివేక్ వెంకటస్వామి పరిస్థితి దారుణంగా తయారైంది . దళితుడిని సీఎం చేస్తాననడంతో ఆశతో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ (టీఆర్ ఎస్) లో చేరారు . అది నెరవేరక పోవడంతో అసంతృప్తితో బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు . కొద్దిరోజులుగా బీజేపీలో కూడా ఇతర నాయకులతో పొసగడం లేదు . దీంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నట్లు తెలిసింది. బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్న క్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ లో గెలిచి కేంద్రంలో మంత్రి పదవి చేపట్టాలని భావించారు. ప్రస్తుతం కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుండటం , బీఆర్ఎస్ బలంగా ఉండటం వల్ల బీజేపీలో ఉంటె నష్టం అని యోచిస్తున్నట్లు సమచారం. బీఆర్ఎస్ వైపు చూస్తున్నప్పటికీ అక్కడ అవకాశం లేకుండా ఉంది . కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వివేక్ ను కూడా కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది . ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి నియోజక వర్గంలో ప్రచారం చేసుకున్న వివేక్ ..ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరితే నష్టపోతాననే భయం లో ఉన్నట్లు అయన అనుచరులు చెబుతున్నారు

రఘునందన్ రావు మీద ఇదే రకమైన ప్రయత్నాలు బీజేపీ నాయకులు చేస్తే తన దారి తాను చూసుకునేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. అసంతృప్తి తో ఉన్నాడని తెలిసి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం . అయితే రఘునందన్ రావు ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. పార్టీ మారాల్సి వస్తే బీఆర్ఎస్ ను ఎంచుకోవాలని ఒత్తిడి పెరుగుతున్నది . ఇక వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ వైపు చేస్తున్నప్పటికీ లాభ నష్టాలు అంచనా వేసుకుంటున్నాడని అంతరంగికులు చెబుతున్నారు .

Recent

- Advertisment -spot_img