Homeఫ్లాష్ ఫ్లాష్Social media: సోషల్ మీడియా వర్సెస్ ప్రధాన మీడియా రచ్చ రచ్చ.. రేవంత్ అనుకూల ,...

Social media: సోషల్ మీడియా వర్సెస్ ప్రధాన మీడియా రచ్చ రచ్చ.. రేవంత్ అనుకూల , వ్యతిరేకంగా మీడియా వర్గీకరణ

Social media: రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు పై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వివాదానికి దారితీశాయి. రేవంత్ రెడ్డి కామెంట్స్ రెండు పార్టీల మధ్య దుమారం రేపుతున్నాయి. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. రెండు పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. మూడెకరాలు ఉన్న రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఈ వ్యాఖ్యలు పూర్తిగా బూమరాంగ్ అయ్యాయి. రేవంత్ అసలు ఉచిత విద్యుత్ వద్దు అన్నారని బీఆర్ఎస్ అనుకూల మీడియా జోరుగా ప్రచారం చేసింది. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా వెంటనే అలర్ట్ అయ్యారు.

ఈ వీడియోను వాడుకొని బీఆర్ఎస్ తన స్టైల్ లో రేవంత్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు అవసరం లేదన్నది నిజం. చిన్నకారు రైతుల పేరు చెప్పి భూస్వాములు వాడుకుంటున్నారని ఆరోపించారు. దీన్ని కీటీఆర్ పక్కాగా వాడారు. బీఆర్ఎస్ శ్రేణులకు పక్కాగా దిశానిర్దేశం చేశారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని, దీనికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష్డ డు రేవంత్ రెడ్డి మాటలే నిదర్శనమని చూపెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని కేటీ ఆర్ పిలుపు నివ్వడంతో పార్టీ శ్రేణులన్నీ రేవంత్ దిష్టి బొమ్మల దహనం కార్యక్రమాలను తీసుకున్నాయి. జరిగిన డ్యామేజీనీ కవర్ చేసుకోవడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడో దగ్గర కాంగ్రెస్ కు కొంత నష్టం జరిగిందనే చెప్పాలి. అధికారంలోకి వస్తే 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని నెత్తీనోరు కొట్టుకున్నా ..జరిగిన డ్యామేజీనీ పూర్తిస్థాయిలో కవర్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నది. ఈ విషయంలో అధికార పార్టీ సరిగ్గా సమయస్ఫూర్తి ప్రదర్శించి పై చేయి సాధించిందనే చెప్పాలి.

ఇక మీడియా వ్యవహారానికి వస్తే సోషల్ మీడియా, మేయిన్ స్ట్రీం మీడియా రెండుగా విభజించబడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎలా పోటీ నడుస్తున్నదో అలాగే సోషల్ మీడియా, ప్రధాన స్రవంతి మీడియా మధ్య పోటీనడుస్తున్నది. రేవంత్ వ్యవహారంలో సోషల్ మీడియాలో ప్రధానంగా ఎక్కువ వీక్ష్రకులు ఉన్న తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ , రఘుకు చెందిన మన తొలివెలుగు , తొలివెలుగు , అర్ టీవీ వంటి కాళోజి టీవీ వంటి మీడియా రేవంత్ కు సపోర్ట్ గా రంగంలోకి దిగగా టీవీ 9, ఎన్టీవీ తోపాటు టీ న్యూస్ తో పాటు మరికొన్ని పత్రికలు రేవంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేశాయి. ఎప్పటి మాదిరిగానే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రేవంత్ కు అనుకూలంగా వార్తలు ప్రచా(సా)రం చేశాయి. ఇక టీవీ్ 5 చానల్ కూడా రేవంత్ కు డ్యామేజీ జరుగకుండా చూసింది. ఈనాడు వంటి పత్రిక రేవంత్ వ్యాఖ్యలను ప్రచురిచండమే కాకుండా బీ ఆర్ ఎస్ భావజాలాన్ని కూడా ప్రచురించి తటస్థంగా ఉన్నది. ఆంధ్రప్రభ, నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ కు అనుకూలంగా రేవంత్ కు వ్యతిరేకంగా వార్తలు వడ్డించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పోల్చితే మీడియా సంస్థలు రేవంత్ రెడ్డి వ్యతిరేకం, అనుకూల వర్గాలుగా విడిపోయి వార్తలు అందించడంతో ప్రజలు, పాఠకుల్లో చర్చనీయాంశమైంది.

Recent

- Advertisment -spot_img