HomeజాతీయంMAHA:మహా’ సీఎంగా షిండేనే..

MAHA:మహా’ సీఎంగా షిండేనే..

మహా’ సీఎంగా షిండేనే..

  • క్లారిటీ ఇచ్చిన ఫడ్నవీస్
  • అజిత్ సీఎం అంటూ కొన్ని రోజులుగా ప్రచారం
  • తాజాగా క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర సీఎంగా మారబోతున్నారని.. అజిత్ పవార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారంటూ గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని తాజాగా బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ఖండించారు. ఏక్ నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. అజిత్ ముఖ్యమంత్రి అవుతారన్నది కేవలం ఊహాగానాలేనని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్‌ పవార్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిఫలంగా మహా సీఎం ఏక్‌నాథ్‌ షిండే అజిత్‌పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అంతే కాకుండా పవార్‌ వర్గం ఎమ్మెల్యేలు తొమ్మిది మందిని తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఈ అనూహ్య పరిణామాలతో మహరాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఎక్కడ చూసినా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల గురించే వాడీవేడిగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్థానాన్ని అజిత్ పవార్ భర్తీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో మహా ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ కొందరు ఇప్పటికే వ్యాఖ్యానించారు కూడా. మహా ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ కూడా ఇటీవలే మాట్లాడారు. ఆగస్టు 10 నాటికి షిండే స్థానంలోకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ వస్తారని వ్యాఖ్యానించారు. ఈ వార్తల నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా స్పందించారు. ముఖ్యమంత్రి మార్పుపై స్పష్టతనిచ్చారు.

Recent

- Advertisment -spot_img