- నాన్ స్టాప్ గా వర్షాలు
- హైదరాబాద్ లో తెరిపిలేకుండా వాన
- రోడ్డపైకి చేరుకున్న వరద
- జిల్లాల్లోనూ సేమ్ సీన్
- మరో 48 గంటలు హై అలర్ట్
- కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు
rains: ఇదే నిజం, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షం అస్సలు బ్రేక్ ఇవ్వడం లేదు. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో రోడ్ల మీదకే వరద వచ్చి చేరుతుండటంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. మరోవైపు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పగలు, రాత్రి తేడా లేకుండా నాన్‌స్టాప్‌గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షం కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లోని మూసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద వరద ప్రవహిస్తోంది.
సీఎస్ కీలక సమీక్ష
వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అలర్ట్ అయ్యారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ జిల్లాలో మూసీ ఉధ్రుతంగా ప్రవహిస్తోంది.
వర్షంలో బండి ఆగిందా? .. ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి..!
హైదరాబాద్ లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నగరంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నడిరోడ్డుపై వాహనాలు మొరాయిస్తే, ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కరించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కడ బండి ఆగిన వెంటనే ఈ 83339 93360 నెంబర్‌కు వాట్సప్ కాల్ చేస్తే సైబరాబాద్ పోలీసులు సహాయం చేస్తారు. ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధి వరకు మాత్రమేనని పోలీసులు స్పష్టం చేశారు.