Homeఫ్లాష్ ఫ్లాష్Delhi Bill: ఏమిటీ ‘ఢిల్లీ బిల్లు’

Delhi Bill: ఏమిటీ ‘ఢిల్లీ బిల్లు’

అసలు ఏమిటీ బిల్లు?

Delhi Bill: ఇదేనిజం, స్టేట్ బ్యూరో: ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు -2023 ఆమోదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బిల్లుపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు బీజేపీ మాత్రం ఢిల్లీలో అవినీతిని అరికట్టేందుకే ఈ బిల్లును తెచ్చామని చెబుతోంది.

కాగా రాష్ట్రాలపై పెత్తనం చెలాయించేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజ్య‌స‌భ‌లో తాజాగా జ‌రిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 131 ఓట్లు వ‌స్తే.. ప్ర‌తికూలంగా 102 ఓట్లు ప‌డ్డాయంటేనే.. ఈ బిల్లును ఎంత‌గా వ్య‌తిరేకిస్తున్నాయో.. అర్థం చేసుకోవ‌చ్చు. అయితే అసలు ఈ బిల్లు ఏమిటి? ఇందులో ఏ అంశాలు ఉన్నాయి? విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించేందుకు కారణాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం..

రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 239 ఏఏ ప్ర‌కారం.. ఢిల్లీని అంసెబ్లీతో కూడిన‌ కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించారు. 1991 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. సుమారు 22 సంవ‌త్స‌రాలుగా ఎలాంటి స‌మ‌స్య లేకుండా.. అటు కేంద్ర పాలిత ప్రాంతంగా.. ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వంగా కూడా.. ఇక్క‌డ పాల‌న సాగిపోతోంది.

ప్రస్తుతం రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పూర్తి అధికారాలు ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నాయి. అయితే తాజాగా తీసుకొచ్చిన బిల్లుతో అధికారుల బ‌దిలీలు, నియామ‌కాలు, వారికి విధుల నిర్దేశం వంటివాటిపై నియంత్ర‌ణ వ్య‌వ‌హారాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోతాయి.

తహసీల్దార్​ నుంచి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల వ‌ర‌కు.. రెవెన్యూ ఉద్యోగుల నుంచి ఉపాధ్యాయుల వ‌ర‌కు కూడా పోస్టింగ్‌లు, బదిలీలు, విజిలెన్స్, ఇతర ఆకస్మిక సమస్యలపై ఢిల్లీ లో ప్ర‌జాస్వామ్య యుతంగా ఏర్పడిన ప్ర‌భుత్వానికి ఎలాంటి అధికారం ఉండ‌దు.

బ‌దిలీలు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల‌ను కేవ‌లం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సిఫార్సులు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం ప‌రిమితం అవుతుంది. అంటే.. ఒక అధికారి అవినీతి చేస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌ని గుర్తించినా.. కూడా ఏమీ చేయ‌లేని దైన్య స్థితికి కేజ్రీవాల్ ప్ర‌భుత్వం చేరిపోతుంది.

అధికారుల విచారణలు, సస్పెన్షన్‌లు కేంద్రం అధీనంలో ఉంటాయి. ఢిల్లీ అసెంబ్లీని ప్రొరోగ్ చేయడం, సమన్లు చేయడం, రద్దు చేయడం వంటి విషయాలపై లెఫ్టినెంట్ గవర్నర్ తన స్వంత విచక్షణాధికారాన్ని వినియోగించుకునే అధికారం ఉంటుంది. అందుకే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img